COVID-19: షాకింగ్ న్యూస్.. కోవిడ్ -19 నుంచి కోలుకున్న వ్యక్తులకు ఈ సమస్యలు తప్పవు
- కోవిడ్ -19 వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తులపై అధ్యయనాలు
- అధ్యయనాలలో కొన్ని సాధారణ అంశాలు
- రోగులలో అలసట అనేది చాలా తరచుగా వస్తుందని వెల్లడి
- ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నుంచి కోలుకున్న వారిపై 194 అధ్యయనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ -19 వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తులపై భారతదేశం, విదేశాలలో నిర్వహించిన అధ్యయనాలలో కొన్ని సాధారణ అంశాలు వెలువడ్డాయి. ఆసుపత్రిలో చేరినా.. ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటున్న, మిశ్రమ పద్ధతుల ద్వారా కోలుకున్న రోగులలో అలసట అనేది చాలా తరచుగా వస్తుందట. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత.. అలసట చాలా మందికి ఇబ్బందిగా మారిందని నివేదికలు స్పష్టం చేశాయి. సాధారణంగా.. శ్వాస ఆడకపోవడం, వాసన, రుచిని తెలియకపోవడం, అస్పష్టమైన దృష్టి, తలనొప్పి, దగ్గు, తేలికపాటి జ్వరం, భయం, మైకం, నిరాశ, కండరాలు-కీళ్ల నొప్పులు వంటివి కోవిడ్ లక్షణాలు అని అందరికీ తెలిసిందే. కోవిడ్ నుంచి కోలుకున్న 45 శాతం మందికి ఇందులో కనీసం ఒక లక్షణమైనా పరిష్కారం కాలేదని తేలింది.
READ MORE: Anushka Sharma: పెళ్లికి ముందే తల్లినయ్యా.. అనుష్క శర్మ షాకింగ్ కామెంట్స్!
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం.. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిద్ర లేమి, నిరంతర దగ్గు, ఛాతీ నొప్పి వంటి సమస్యలు ఉన్నాయని రాజ్యసభలో ఒక ప్రశ్న తలెత్తింది. దీనికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కోవిడ్ తర్వాత సమస్యలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయని సమాధానంలో పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థ యొక్క అసమతుల్యత, ఆటో-ఇమ్యూనిటీ లోపం, డైస్బియోసిస్, మైక్రోథ్రాంబి, దైహిక ఫైబ్రోసిస్, నిరంతర సీఎన్ఎస్ ఇన్ఫెక్షన్ వంటి అంశాలు కోవిడ్ అనంతర సమస్యలకు కారణం కావచ్చని తెలిపింది.
READ MORE:Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ – 3.. షూటింగ్ ఎప్పుడంటే..?
ఇప్పటివరకు 194 అధ్యయనాలు..
కోవిడ్ 19పై ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 194 అధ్యయనాలు వెలువడ్డాయి. ఖండాల వారీగా నివేదికల సంఖ్య ఇలా ఉంది. ఐరోపాలో 106 అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఆసియాలో 49, ఉత్తర, దక్షిణ అమెరికాలో 31.. ఇతర ఖండాలలో 8 సహా అధ్యయనాలు వెల్లడించాయి. ఈ అధ్యయనాలు క్రమబద్ధీకరించి.. సమీక్ష జరిపారు. ప్రతి రెండు అధ్యయనాల నుంచి మిశ్రమ ఫలితాన్ని రాబట్టారు. ఆసుపత్రిలో చేరిన (28.4 శాతం), ఆసుపత్రిలో చేరని (34.8 శాతం), మిశ్రమ (25.2 శాతం) వ్యక్తులు చాలా తరచుగా అలసట లక్షణాలను కలిగిఉన్నట్లు నివేదించాయి. ఆసుపత్రిలో చేరిన రోగులలో అత్యంత ప్రబలంగా ఉన్న ఐదు లక్షణాలు.. అలసట (28.4 శాతం-70 అధ్యయనాల ప్రకారం), నొప్పి, అసౌకర్యం (27.9 శాతం-10 అధ్యయనాలు), నిద్రలేమి (23.5 శాతం-34 అధ్యయనాలు), శ్వాస ఆడకపోవడం (22.6 శాతం-70 అధ్యయనాలు) వంటి లక్షణాలను కనుగొన్నట్లు అధ్యయనాలు వెలువరించాయి.
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!