దేశంలో దొంగ బాబాల గురించి నిత్యం వార్తలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయినా ప్రజలు బాబాల మీద నమ్మకంతో వారిని ఆశ్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ దొంగబాబు రాసలీలలు బయటపడ్డాయి. ఆ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు చాంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ బాబా, అతడి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై ఓ బాబా అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే… అనారోగ్యానికి గురైన తల్లిని కాపాడుకునేందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఓ బాబాను ఆశ్రయించారు. ఆ బాబా పేరు సయ్యద్ హసన్ అక్సారి.
Read Also: ఆ హీరోయిన్ తో నాగ చైతన్య ప్రేమ.. మధ్యలో సమంత రాకతో
అయితే తల్లికి వైద్యం కోసం వచ్చిన యువతులపై సయ్యద్ బాబా కన్నేశాడు. మంత్రాల పేరు చెప్పి సదరు బాబా అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి తెగబడ్డాడు. అందులోని ఓ యువతికి పెళ్లి కాగా…ఆమెకు విడాకులు ఇప్పించి మరీ పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ వివాహితపై బాబా కుమారుడు సయ్యద్ అఫ్రోజ్ సైతం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరు యువతులను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా ఆర్థికంగానూ దొంగబాబా కుంగదీశాడు. దీంతో తేరుకున్న బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించగా… బాబా సయ్యద్ హసన్ అక్సారి, అతడి కుమారుడు సయ్యద్ అఫ్రోజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు తాయత్తులు, 10 జీడి గింజలు, సాంబ్రాణి పొడి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.