విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒక్కరోజు నిరాహారదీక్ష ముగిసింది. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం పరిశ్రమ మాత్రమే కాదని.. ఆంధ్రుల ఆత్మగౌరవమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను వెళ్లి కేంద్రంతో గొడవ పెట్టుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. Read Also: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు…
టాలీవుడ్ హీరోయిన్‌లలో సమంత గత కొన్నిరోజులుగా నిత్యం వార్తల్లో ఉంటోంది. ఒకవైపు నాగచైతన్యతో విడాకుల గొడవ.. మరోవైపు పుష్పలో ఐటం సాంగ్ వంటి విషయాలతో సమంత వార్తల్లో నిలుస్తోంది. దీంతో సమంత క్రేజ్‌ను పలు వ్యాపార సంస్థలు కూడా క్యాష్ చేసుకుంటున్నాయి. తాజాగా కడప పట్టణంలో ఆదివారం నాడు హీరోయిన్ సమంత సందడి చేసింది. కడప ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరైంది. Read…
ఫేస్‌బుక్ మరో సరికొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఫేస్‌బుక్ ఖాతాలను యాక్సెస్ చేయలేని వారు, బ్లాక్ అయిన ఖాతాలను తిరిగి యూజర్లు పొందేందుకు.. లైవ్ చాట్ సపోర్ట్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ యాడ్ చేసింది. ఈ ఫీచర్.. యూజర్లు తమ ఖాతాలను తిరిగి పొందేందుకు తోడ్పడనుంది. అయితే, లైవ్ చాట్ సపోర్ట్ కేవలం ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉంది. ఫేస్‌బుక్ సపోర్ట్‌పై క్లిక్ చేస్తే కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌తో యూజర్లు చాట్ చేసే అవకాశం కల్పిస్తోంది. Read Also: జనవరి 1 నుంచి…
కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. వీఐపీ బ్రేక్ దర్శనం, అభిషేకం టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ఈవో స్పష్టం చేశారు. ఆర్జిత సేవా టికెట్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే తాము ఆధార్ నిబంధనను తీసుకొచ్చినట్లు ఈవో లవన్న చెప్పారు. Read Also: జనవరి 1 నుంచి విజయవాడలో బుక్ ఫెయిర్
విజయవాడలో జనవరి 1, 2022 నుంచి జనవరి 10 వరకు బుక్ ఫెయిర్ జరగనుంది. జనవరి 1న సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 340 మంది పబ్లిషర్స్ ఈ బుక్ ఫెయిర్‌కు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. 32వ బుక్ ఫెయిర్‌ను విజయవాడలోని స్వరాజ్ మైదానం లేదా శాతవాహన కాలేజీలో నిర్వహిస్తామని బుక్ ఫెస్టివల్ సొసైటీ సమన్వయకర్త డి.విజయ్ కుమార్ వెల్లడించారు. 10న ముగింపు సభ, విద్యార్థులకు…
ఏపీ రాజధాని అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. మంగళగిరిలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా దీక్షకు దిగిన పవన్‌ను అమరావతి ప్రాంత మహిళా రైతులు కలిశారు. తొలి నుంచి అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉన్న పవన్‌కు కృతజ్ఞతలు చెప్పిన వారు.. ముగింపు సభకు రావాలని ఆహ్వానించారు. తమ ఆహ్వానం పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు అమరావతి ప్రాంత మహిళా రైతులు వెల్లడించారు.…
టీమిండియా యువక్రికెటర్ వెంకటేష్ అయ్యర్ దేశవాళీ టోర్నీలో రెచ్చిపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతడు సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. చండీగఢ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరఫున ఆడుతున్న వెంకటేష్ అయ్యర్.. ఆరో స్థానంలో బ్యాటింగుకు దిగిన కేవలం 113 బంతుల్లోనే 133 స్ట్రైక్‌రేట్, 8 బౌండరీలు, 10 సిక్సర్లు బాదేసి 151 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన వెంకటేష్ అయ్యర్ తన సెంచరీని సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అంకితం ఇచ్చాడు. అంతేకాకుండా తలైవా…
దేశంలో ఈశాన్య రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కులు జిల్లా సైంజ్ వ్యాలీలో ఉన్న మజ్‌హన్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడడంతో పక్కపక్కనే ఉన్న 26 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు, 26 పశువుల కొట్టాలకు కూడా మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. Read Also: సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. వారిపై…
రేపటి నుంచి పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడనున్న వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లతో పాటు సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. రోస్టన్ ఛేజ్, షెల్డన్ కాట్రెల్, కైల్ మేయర్స్‌తో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నలుగురిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు విండీస్ బోర్డు ప్రకటించింది. అయితే షెడ్యూల్ ప్రకారమే టీ20 సిరీస్…
లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు నేడు చిత్తూరు జిల్లాలోని జరుగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఎగువరేగడికి సాయితేజ భౌతికకాయం చేరుకోనుంది. మధ్యాహ్నం సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష చేపట్టారు. మంగళగిరిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్ దీక్ష జరుగనుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్ స్పందించాలని పవన్ డిమాండ్…