అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. న్యూఇయర్ వేడుకల్లో దుండగులు కాల్పుడు జరిపారు. న్యూఇయర్ వేడుకలకు వచ్చిన దుండగులు వేడుకలను మొదలైన కాసేపటికి కాల్పులు జరిపారు. ఒక్కసారి తుపాకీ పేలిన శబ్దం వినడంతో వేడుకల్లో ఉన్న జనం పరుగులు పెట్టారు. అమెరికాలోని మిసిసిపీ గల్ఫ్‌పోర్ట్‌లో నిర్వహించిన నూతన సంవత్సరం వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల కాల్పుల్లో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.…
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తూ శనివారం నాడు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో జనవరి 10 వరకు ర్యాలీలు, బహిరంగసభలపై నిషేధం విధించింది. తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై సీఎస్ సోమేష్ కుమార్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఈ జీవోను జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. Read Also:…
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే… ముమ్మిడివరం పంచాయతీకి చెందిన గ్రామ వాలంటీర్ లక్ష్మీకుమారి శనివారం నాడు అన్నంపల్లి వద్ద అకస్మాత్తుగా గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఈ సమాచారాన్ని వైసీపీ కౌన్సిలర్ విజయ్‌కు చేరవేశారు. దీంతో వైసీపీ కౌన్సిలర్ విజయ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వాలంటీర్‌ను కాపాడేందుకు గోదావరిలో దూకారు. Read Also: భయం గుప్పిట్లో ప్రపంచం… సునామీలా దూసుకొస్తున్న…
తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాలలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం… ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ (ODF) విషయంలో తెలంగాణ 96.74 శాతంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ తర్వాతి స్థానంలో తమిళనాడు (35.39 శాతం), కేరళ (19.78 శాతం), ఉత్తరాఖండ్ (9.01 శాతం), హర్యానా (5.75 శాతం), కర్ణాటక (5.59 శాతం), ఆంధ్రప్రదేశ్ (4.63 శాతం) ఉన్నాయి. జమ్మూకశ్మీర్, బీహార్,…
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 10 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. సంక్రాంతి సందర్భంగా ఈనెల 7, 22 తేదీల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 7, 14వ తేదీల్లో కాచిగూడ-విశాఖపట్నం, 8, 16 తేదీల్లో విశాఖపట్నం-కాచిగూడ, 11న కాచిగూడ – నర్సాపూర్, 12న నర్సాపూర్- కాచిగూడ, 19, 21 తేదీల్లో కాకినాడ టౌన్- లింగంపల్లి, 20, 22 తేదీల్లో లింగంపల్లి – కాకినాడ టౌన్…
హైదరాబాద్ నగరంలో క్రమంగా ఫ్లైఓవర్ల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో హైదరాబాద్ సిటీ మరింత స్మార్ట్‌గా మారుతోంది. తాజాగా షేక్‌పేటలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ స్థానికులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన నైట్ విజువల్ ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. లైట్ల వెలుతురులో ఈ ఫ్లై ఓవర్ అద్భుతంగా కనిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. Read Also: టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 12 ఏళ్ల లోపు చిన్నారులకు శాశ్వతంగా ఉచిత ప్రయాణం…
దూకుడుగా బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉన్న క్రిస్ గేల్‌కు వెస్టిండీస్ బోర్డు షాకిచ్చింది. కెరీర్‌లో తన చివరి టీ20 మ్యాచ్‌ను సొంతగడ్డపై ఆడాలని గేల్ భావించాడు. ఈ విషయాన్ని వెస్టిండీస్ బోర్డుతో కూడా పంచుకున్నాడు. అయితే త్వరలో సొంతగడ్డపై ఇంగ్లండ్, ఐర్లాండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌లకు వెస్టిండీస్ సెలక్టర్లు తాజాగా జట్టును ప్రకటించగా అందులో గేల్ పేరు లేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. Read Also: క్రీడాభిమానులకు శుభవార్త… అమెజాన్ ప్రైమ్‌లో క్రికెట్ లైవ్ గేల్ కోరికను…
తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు టీఎస్ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులందరూ శాశ్వతంగా ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతుందని బాజిరెడ్డి ఆకాంక్షించారు. Read Also: న్యూఇయర్ స్పెషల్: నిమిషానికి…
త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీ మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఓ నూతన పథకాన్ని ప్రకటించింది. Read Also: ఒమిక్రాన్‌కు ఉచిత పరీక్ష… లింక్ క్లిక్ చేస్తే రాష్ట్రంలో 10వ…
నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల గుండెపోటుకు గురికావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. Read Also: డప్పుతో దరువేసిన ఎమ్మెల్యే… ఎవరో తెలుసా? తాను ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని వీడియోలో ఎమ్మెల్యే మేకపాటి తెలిపారు. తాను ప్రస్తుతం…