Home
Latest Telugu News
Latest Telugu News News
-
చిక్కుల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు.. పోలీసుల గాలింపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీసేవా నిర్వాహకుడు రామకృష్ణ ఆత్మహత్య ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆస్తి వివాదాల కారణంగా భార్యా పిల్లలతో సహా రామకృష్ణ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మీ సేవా నిర్వాహకుడు రామకృష్ణతో పాటు అతడి భార్య లక్ష్మీ, కూతూరు సాహిత్య సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. Read Also: శ్రీహరికోటలో కరోనా కలకలం… 14 మందికి పాజిటివ్… -
జగన్ మళ్లీ సీఎం కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ధర్మాన
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని… జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ మళ్లీ సీఎం కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ధర్మాన స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ… వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తుండటంపై మండిపడ్డారు. టీడీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ధర్మాన ఆగ్రహం… -
మళ్లీ పెరుగుతున్న కేసులు… భారత్‌లో కొత్తగా 37వేల మందికి పైగా కరోనా పాజిటివ్
కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో భారత్‌లో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 37,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 124 మంది కరోనాతో చనిపోయారు. రోజువారీ పాజిటివ్ రేటు పెరిగి 3.24 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. Read Also: సంక్రాంతి బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ… -
సంక్రాంతి బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ అలా.. టీఎస్ఆర్టీసీ ఇలా…
మరో 10 రోజుల్లో సంక్రాంతి పండగ రానుంది. అతి పెద్ద పండగ కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు అందరూ సొంతూళ్ల బాట పడతారు. ఈ సందర్భంగా రైళ్లు, బస్సులు కిటకిటలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ప్రత్యేకంగా 6,970 బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. పండుగకు ముందు 4,145 బస్సులు, ఆ తర్వాత 2825 బస్సులను తిప్పనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జనవరి 8వ తేదీ నుంచి ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే స్పెషల్ బస్సుల్లో… -
తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న చలి
తెలంగాణలో చలి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల తక్కువ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు చలి అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగుజాగ్రత్తలు వహించాలని వారు సూచించారు. Read Also: బీ అలర్ట్… దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది మరోవైపు… -
హస్తినలో సీఎం జగన్.. నేడు కేంద్రమంత్రులతో వరుస భేటీలు
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా ఉన్నారు. సోమవారం నాడు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన సీఎం జగన్… మంగళవారం నాడు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఉదయం 9:30 గంటలకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం జగన్ భేటీకానున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో జగన్ సమావేశం కానున్నారు. Read Also: బీ అలర్ట్… దేశంలో కరోనా థర్డ్ వేవ్… -
బీ అలర్ట్… దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది
ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ డా. ఎన్‌కే అరోరా స్పష్టం చేశారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో నమోదవుతున్న కేసుల్లో 75 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే అని ఆయన తెలిపారు. గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో మొదటి ఒమిక్రాన్ కేసును గుర్తించగా రెండు వారాల్లోనే ఈ వేరియంట్ దేశమంతటా వ్యాపించిందని పేర్కొన్నారు. డిసెంబర్ తొలివారం నుంచి చివరి వారం వరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 12 శాతం… -
తిరుమలలో నకిలీ దర్శన టిక్కెట్లు… నలుగురి అరెస్ట్
తిరుమలలో నకిలీ దర్శన టిక్కెట్లను విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కృష్ణారావు, స్కానింగ్ ఆపరేటర్ నరేంద్ర, లడ్డూ కౌంటర్ ఉద్యోగి అరుణ్ రాజు, ట్రావెల్ ఏజెంట్ బాలాజీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు మధ్యప్రదశ్‌కు చెందిన ముగ్గురు భక్తులకు నకిలీ దర్శన టిక్కెట్లు విక్రయించారు. మూడు రూ.300 దర్శనం టిక్కెట్లను రూ.21వేలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. Read Also: గుడ్ న్యూస్… ఒమిక్రాన్ చికిత్సకు… -
గుడ్ న్యూస్… ఒమిక్రాన్ చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్
దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న వేళ బీమా నియంత్రణ, అధివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా ఆరోగ్య బీమా పాలసీల్లో ఒమిక్రాన్ చికిత్సకు చేసిన ఖర్చులు కూడా కవరేజీ అవుతాయని ప్రకటించింది. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు జారీ చేసిన అన్నిరకాల ఆరోగ్య బీమా పాలసీల్లో కరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాలని ఐఆర్‌డీఏఐ గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో తన ఆదేశాలను… -
తెలంగాణలో రేపటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ
రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు బుధవారం నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ తెలిపింది. పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముందు శనివారానికి బదులుగా మంగళవారం నుంచి పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో బుధవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి నెల 1వ తేదీ లేదా 2వ తేదీ నుంచి రేషన్ బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. Read Also: మరిన్ని…
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?