హైదరాబాద్ నగరంలో క్రమంగా ఫ్లైఓవర్ల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో హైదరాబాద్ సిటీ మరింత స్మార్ట్‌గా మారుతోంది. తాజాగా షేక్‌పేటలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ స్థానికులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన నైట్ విజువల్ ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. లైట్ల వెలుతురులో ఈ ఫ్లై ఓవర్ అద్భుతంగా కనిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 12 ఏళ్ల లోపు చిన్నారులకు శాశ్వతంగా ఉచిత ప్రయాణం
కాగా ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు విదేశాలలో ఉండే మాదిరిగా భవనాలు, రోడ్లు, లైట్లు కనిపిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్‌ను నూతన సంవత్సర కానుకగా శనివారం నాడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దాదాపు 350 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టోలిచౌకి రిలయన్స్ మార్ట్ నుంచి షేక్ పేట, రాయదుర్గం దాదాపు 3 కి.మీ పొడవైన ఈ ఫ్లై ఓవర్ వల్ల మెహిదీపట్నం-హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి.
This one does look good with lights on 👇 pic.twitter.com/UNeJ0cVsY7
— KTR (@KTRTRS) January 1, 2022