దేశంలో ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు సంబంధించి ఓ స్కాం తాజాగా వెలుగు చూసింది. టెలిగ్రామ్‌ను ఉపయోగించుకుని షేర్ల ట్రేడింగ్ కుంభకోణానికి పలు సంస్థలు తెరతీశాయని ఆరోపణలు రావడంతో సెబీ రంగంలోకి దిగింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో సెబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయా సంస్థలు టెలిగ్రామ్ ద్వారా 50 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్ల కోసం రికమండేషన్లు అందించినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన లిస్టెడ్ షేర్లకు సంబంధించి సలహాలు ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లు…
నుమాయిష్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ నుమాయిష్ ఈ సంవత్సరం కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఆలస్యం ప్రారంభమైంది. ఈ నుమాయిష్‌లో వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది వ్యాపారులు వస్తుంటారు. అనేక రకాల వంటకాలు, వస్తువులు ఇంకా ఎన్నో ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ నుమాయిష్‌కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైద్రాబాద్ ట్రాఫిక్ విభాగం లో నేను…
CM KCR to recover quickly from illness says Governor Tamilisai Soundararajan. సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి ఆయన వెళ్లారు. నిన్నటి నుంచి ఎడమ చేయి, నొప్పిగా అనిపిస్తోందని.. నీరసంగా ఉన్నారని సీఎంవో వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు పలు వైద్య పరీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు హార్ట్ యాంజియోగ్రామ్, సిటీ స్కాన్…
రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కోసం కొత్త కస్టమర్లను చేర్చుకోరాదని ఆర్‌బీఐ ఆదేశించింది. అంతేకాకుండా కంపెనీ ఐటీ సిస్టమ్‌ను సమగ్రంగా ఆడిట్ చేసేందుకు ఐటీ ఆడిట్ కంపెనీని నియమించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ ఆడిటర్ల నివేదిక వచ్చే వరకు కొత్త కస్టమర్లను తీసుకోవద్దని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35ఏ ప్రకారం ఆడిటింగ్‌కు ఆదేశించామని స్పష్టం చేసింది. ఒకవేళ ఆన్‌బోర్డు చేయాలంటే ఆర్‌బీఐ ప్రత్యేక…
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రభావం చమురు ధరలపై విపరీతంగా చూపిస్తోంది. ఫలితంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా శ్రీలంకలో చమురు ధరలను పెంచుతున్నట్లు ఎల్‌ఐవోసీ ప్రకటించింది. ఈ మేరకు లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్ ధర రూ.75 పెంచుతున్నట్లు తెలిపింది. ధరలను పెంచిన అనంతరం లీటర్ పెట్రోల్ ధర రూ.254కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.214కి చేరింది. మరోవైపు శ్రీలంక రూపాయి భారీగా పతనమైంది. ఈ…
Minister Koppula Eshwar Detailed about DR BR Ambedkar Statue. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల డా. బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే గతంలో కొన్ని మార్పులు చేసామని, అవన్నీ మళ్ళీ మార్పులు చేసి నమూనా విగ్రహం తయారు చేశారన్నారు. సివిల్ కాంట్రాక్టు వర్క్స్ కూడా బాగా జరుగుతున్నాయని, రెండు అంతస్థుల భవనం, ఆపైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఉంటుందని…
సీబీఎస్‌ఈ టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు 10, 12 తరగతులకు సంబంధించి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం అవుతాయని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. అలాగే మే 24న ఈ పరీక్షలు ముగుస్తాయని షెడ్యూల్‌లో స్పష్టం చేసింది. 12వ తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్ 26న ప్రారంభం అవుతాయని.. ఈ పరీక్షలు జూన్ 15న పూర్తవుతాయని తెలిపింది. ఈ…
కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల పట్టణంలోని విశ్వనగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజనం తిన్నవారిలో కొందరు విద్యార్థులు వెంటనే వాంతులు చేసుకున్నారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఈవో..…
ఏపీ బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తోందని ఆయన కామెంట్ చేశారు. అప్పులు పెట్టిన జగన్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. అప్పులు ఎగ్గొట్టడానికా అంటూ ప్రశ్నించారు. బడ్జెట్లో ఏ ప్రాంతం అభివృద్ధి గురించి ప్రస్తావనే లేదని ఆరోపించారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఎందుకు కేటాయించలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. మసిపూసి…
ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు పెదవి విరిచారు. సంక్షేమ పథకాలన్నీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. పాత పథకాలకు పేరు మార్చి అమలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రభుత్వం ఆధారపడుతోందని.. అప్పుల కోసం తిరగడం తప్ప సంక్షేమం గురించి జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దారి…