నుమాయిష్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ నుమాయిష్ ఈ సంవత్సరం కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఆలస్యం ప్రారంభమైంది. ఈ నుమాయిష్‌లో వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది వ్యాపారులు వస్తుంటారు. అనేక రకాల వంటకాలు, వస్తువులు ఇంకా ఎన్నో ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ నుమాయిష్‌కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైద్రాబాద్ ట్రాఫిక్ విభాగం లో నేను కూడా 3 ఇయర్స్ చేశానని, నుమాయుష్ కి నా చినపుడు వచ్చేవాళ్ళం అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌కి చరిత్ర ఉందని, కోవిడ్ వల్ల ఈ సారి ఆలస్యంగా ప్రారంభమైందన్నారు.
లక్షల మంది దీని మీద ఆధార పడ్డారని, నుమాయుష్ కావాల్సిన పోలీస్ ఫోర్స్ ఇస్తామన్నారు. అంతేకాకంఉడా అవసరాన్ని బట్టి నుమాయుష్ ఎక్సటెన్షన్ కి కృషి చేస్తామన్నారు. పిల్లలు ఇక్కడ ఫ్రీ రైడ్స్ చేసి ట్రాఫిక్ మీద అవగాహన పెంచుకోవచ్చని, హైద్రాబాద్ అమ్మాయిలకు సేఫ్ సిటీ అని వెల్లడించారు. ఇక్కడ నేరాలు అదుపులో ఉంటాయని, షీ టీం, సీసీఎస్ స్టాల్ల్స్ కూడా ఓపెన్ చేశామన్నారు.