TDP Leader, Former Minister Ayyana Patrudu Visited Underground Mines Department. అనకాపల్లి భూగర్భ గనుల శాఖ కార్యాలయానికి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వచ్చారు. ఈ సందర్భంగా అనకాపల్లి డివిజన్ పరిధిలో ఉన్న క్వారీలు క్రషర్ ల అనుమతుల పై మైన్స్ ఏడీని అయ్యన్న పాత్రుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి ఏడీ పరిధిలో 340 క్వారీలు ఉండగా కేవలం 41 క్వారీలకు మాత్రమే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉన్నాయని, మిగతావన్నీ అక్రమ క్వారీలే అంటూ…
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపుతో ఆప్ రాజకీయ సోపానంలో ఒక అడుగు ముందుకు వేసింది. ఇదే సమయంలో ఇది ఎవరికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది అనే చర్చ కూడా మొదలైంది. ఐతే, ఎవరి సంగతి ఎలా ఉన్నా అధికార బీజేపీకి వచ్చే ముప్పు ఉండకపోవచ్చు. ఆ పార్టీ నేతలు కూడా ఇదే మాట చెబుతున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ ఆవిర్భవించాలంటే దాని ఖాతాలో 100 లోక్‌సభ స్థానాలైనా…
BJP MP Bandi Sanjay Completed Two Years as Telangana BJP Chief Post. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆశీర్వచన సభ నిర్వహించారు. కాగా ఆయనను వేములవాడ రాజన్న ఆలయం నుంచి వచ్చిన పురోహితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉండి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ…
అంతర్జాతీయ ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధుక విధానాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సమావేశంలో అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని తిరుపతి, విశాఖ, గుంటూరు-విజయవాడ మధ్య క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్, తిరుపతిలో చిన్నారులకు క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటుపై డీపీఆర్ సిద్ధం…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు మా ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, సస్పెండ్ అయిన మేము హైకోర్టు కి వెళ్ళామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. సస్పెండ్ కి కారణాలు ఏంటి అని రాత పూర్వకంగా హామీ ఆడిగాం ఇంత వరకు ఇవ్వలేదని, స్పీకర్ ఉండే విస్తృత అధికారుల పేరుతో మమ్మల్ని ఆరోజు బయటకు పంపించారన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ కి నోటీసులు ఇవ్వండి అని హైకోర్టు చెప్పిందని, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు తీసుకోవడానికి…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగోలేక శుక్రవారం యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైందంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ అభిమాని వినూత్న రీతిలో కాశీలోని విశ్వేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాయి అనే అభిమాని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శుక్రవారం సాయంత్రం దీపారాధన…
TDP Chief Chandrababu Naidu Fire on YCP Government over Jangareddy Gudem Incident. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 15 మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదన్నారు. నంద్యాలలో విద్యార్థుల అస్వస్థతకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా..? ప్రాణాలు పోతున్నా స్పందించరా..? అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారె. మరణాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని,…
స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న డే/నైట్ టెస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన జడేజా శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన జడేజా (175 నాటౌట్).. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యలతో…
సోషల్ మీడియాలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఆయన ప్రధాన ప్రతిపక్షం టీడీపీని విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల సినిమా టిక్కెట్ రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో టిక్కెట్ రేట్లు ఎందుకు పెంచరంటూ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయగా.. ఇప్పుడు టిక్కెట్ రేట్లు పెంచాక ఆయన ఎందుకు…
That’s why I stay away from Congress Party Says MLA Raj Gopal Reddy. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎన్టీవీ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అధిష్టానం నిర్ణయాల వల్లనే పార్టీ కి దూరంగా ఉంటున్నానని ఆయన వెల్లడించారు. తెలంగాణ కోసం కొట్లాడి వాళ్లకు పదవులు ఇవ్వాలని, టీడీపీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తే ఏం లాభం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కొట్లాడిన…