Andhra Pradesh: ఏపీలో మూడు క్యాన్సర్ ఆస్పత్రులు.. సిద్ధమైన డీపీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధుక విధానాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సమావేశంలో అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు.
రాష్ట్రంలోని తిరుపతి, విశాఖ, గుంటూరు-విజయవాడ మధ్య క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్, తిరుపతిలో చిన్నారులకు క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటుపై డీపీఆర్ సిద్ధం చేసినట్లు సీఎం జగన్‌తో దత్తాత్రేయుడు తెలిపారు. ప్రతి పేదవాడికి క్యాన్సర్ చికిత్స అతి తక్కువ ధరకే అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం బాధితులు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా వారికి రాష్ట్రంలోనే మెరుగైన వైద్యం అందించేలా తాము చర్యలు తీసుకుంటామని సీఎంకు నివేదించారు. కాగా క్యాన్సర్ చికిత్స, స్క్రీనింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని దత్తాత్రేయుడికి సీఎం జగన్ సూచించారు.
Also Read
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!