Pakistan: మా ఉగ్రవాదులే మాపై తిరగబడుతున్నారు.. ఒప్పుకున్న పాకిస్తాన్..
- PoKలో పోరాడుతున్న వారిపై రాణా సనావుల్లా కీలక వ్యాఖ్యలు.
- ఒకప్పుడు పాకిస్తాన్ శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులే అని అంగీకారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో(PoK)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలపై దమనకాండకు తెగబడుతోంది. ఉద్యమకారులపై పాక్ సైన్యం కాల్పులు జరపడంతో తాజాగా 20 మందికి పైగా మరణించారు. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో పాక్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 80 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మరోవైపు, ఆక్రమిత భూభాగంలో పాకిస్తాన్ ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధం అవుతోంది. పీఓకే ప్రజలు ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఉగ్రవాదంపై మరోసారి ఒప్పుకుంటూ వ్యాఖ్యలు చేసింది. తాము పెంచి పోషించిన పామే ఇప్పుడు తమను కాటేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రాజకీయ సలహాదారు రాణా సనావుల్లా ఒప్పుకున్నారు. ఒకప్పుడు పాకిస్తాన్ శిక్షణ ఇచ్చి ముజాహిదీన్లుగా పంపిన వ్యక్తులే ఇప్పుడు తమకు పెద్ద సమస్యగా మారారని అన్నారు. “ఈరోజు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పోరాడుతున్న వారిలో చాలామంది గతంలో మనం ముజాహిదీన్లుగా శిక్షణ ఇచ్చి పంపినవారే. అప్పటి నుంచి వారు మనపై పగ పెంచుకున్నారు” అని అన్నారు. వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయని అన్నారు. వారికి రాజకీయ లక్ష్యాలు, ప్రజా సంక్షేమం పట్ల ఆసక్తి లేదని, సాధారణ ప్రజల్ని ఉపయోగించుకుని పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.
Also Read
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
తాజావార్తలు
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!