Discussion on Mana Ooru Mana bandi program at Telangana Assembly Budget Session 2022 between Minister KTR and CLP Leade Mallu Bhatti Vikramarka.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. గత సోమవారం ప్రారంభమైన తెలంగాన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జోరుగా నడుస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ సస్పెండ్ చేయడంతో, అసెంబ్లీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మన ఊరు మన బడి కార్యక్రమానికి నిధులు కేటాయించాలని, అంతేకాకుండా స్వీపర్లకు జీతాలు పెంచి వారిని పర్మినెంట్ చేయాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. భట్టి అంటే గౌరవం ఉందని.. కానీ ఆయన మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. 60 ఏండ్లు రాజ్యం ఏలింది మీరు..మీ పార్టీనే కదా, భట్టి ధోరణి డొల్లగా ఉందన్నారు.
మన ఊరు..మన బడి కి నిధులు ఇచ్చింది తెలియదా..? అని ఆయన వ్యాఖ్యానించారు. మీ హయాంలో కంటే 10 రేట్ల రెసిడెన్షియల్ స్కూల్ పెంచామని, భట్టి విమర్శ కోసం విమర్శలు చేస్తున్నారని, సీఎం నిన్న కాక మొన్ననే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ చెప్పారన్నారు. ప్రకటన రాగానే అయిపోతాదా..? కొంత టైం పట్టదా..? అని కేటీఆర్ తెలిపారు. దీనిపై వెంటనే భట్టి లేచి.. మన ఊరు.. మన బడికి ఇచ్చిన నిధులు ఈజేఎస్ నిధులే కదా..? ఒక దానికి కేటాయించిన నిధులు… ఇంకో దానికి బదిలీ చేశారని ఆరోపించారు. జిల్లా, మండల పరిషత్ లకే డబ్బులు లేకుంటే… వాటి నిధులు పక్క దారి పట్టించుకోవడం ఎందుకు..? అని ప్రశ్నించారు. నేను చెప్పేది ఒకటి..కేటీఆర్ చెప్తుంది ఇంకొకటని, సభను..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు కేటీఆర్ అంటూ భట్టి వ్యాఖ్యానించారు.