Andhra Pradesh Deputy CM Amzath Basha about AP Cabinet Expansion. ఏపీ మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్తీకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ పై డిప్యూటీ సీఎం అంజాద్ బాష ఎన్టీవితో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం నాకు శిరోధార్యం అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక మైనారిటీ ఎమ్మెల్యేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే గొప్ప అదృష్టం గా భావిస్తున్నాని ఆయన అన్నారు. సీఎం…
ఏపీలో జిల్లా పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది తరువాత కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజనపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులకు ఆదేశించారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలన్నారు. దీనితోపాటు కనీసంగా 15 ఎకరాల…
తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా.. అంటూ నలభై ఏళ్ల క్రితం 1982 మార్చి 29వ తేదీన ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు ఓ ప్రభంజనం అయింది. ఓ విజయం మరో సంక్షోభం.. అంతకు మించి సవాళ్లు ఎన్నో ఎదుర్కొంటోంది టీడీపీ. కానీ ఎప్పటికప్పుడు కాల పరీక్షలో నిలబడుతూనే ఉంది. జాతీయ పార్టీలు తప్ప.. నలభై ఏళ్ల పాటు నిలబడిన ప్రాంతీయ పార్టీలు అరుదనే చెప్పాలి. ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో నాలుగు దశాబ్దాలంటే తక్కువ సమయమేమీ కాదు.…
సామాన్యులకు అధికారం లేకుండా చేసిన దుర్మార్గ పార్టీ టీఆర్‌ఎస్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే ధర్మాన్ని చెరబట్టలనే చూసే పార్టీ టీఆర్‌ఎస్ అని, ధర్మం నిజమైతే వేల కోట్లు రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయే కేసీఆర్ చెప్పాలన్నారు. సిద్దిపేటలోని కేసీఆర్ భూమి అమ్మి ప్రజలకు ఇవ్వడం లేదు మన సొమ్ము మనకే ఇస్తుండని ఆయన విమర్శించారు. 24గంటల కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదు పంట…
ప్రముఖ సినీ నిర్మాత కెఎస్ రామారావు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్‌ఆర్ఆర్ సినిమాకు ఎంతో సహకారం అందించారన్నారు. పెద్ద,చిన్న సినిమాలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలులో సినిమాకు సంబంధించిన అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయని, కర్నూలులో సినిమా షూటింగ్, ఫిల్మ్ క్లబ్ ఏర్పాటుకు సినీ పెద్దలు ఆలోచించాలన్నారు. ఉగాది పండుగ తరువాత ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను,…
మరో 2 రోజుల్లో ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్ల ఆఫర్ ముగియనుంది. కరోనా కష్టకాలంతో పాటు పేద, మధ్య తరగతి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పెండింగ్ చలాన్లపై పోలీస్ శాఖ రాయితీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. బైకులు 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని.. 75% చలాన్ అమౌంట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కార్లు, లైట్ మోటార్ వెహికల్స్‌కు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, తోపుడు బండ్లకి 80 శాతం రాయితీ కల్పించారు.. అయితే ఈ…
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని పదిలపరుచుకుని యూజర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ సహాయంతో 2జీబీ వరకు ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం యూజర్లకు వాట్సాప్ అందించనుంది. ప్రస్తుతానికి 100 ఎంబీ కన్నా ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ షేర్ చేసుకునేందుకు వాట్సాప్‌లో అవకాశం లేదు. దీంతో పెద్ద సైజ్ ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని…
ప్రగతి భవన్ జనహితలో ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుభకృత్ నామ నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. తెలుగు నూతన సంవత్సరాది శుభకృత్ ఉగాది వేడుకలు ప్రగతి భవన్ లోని జనహితలో ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయని సీఎస్ వెల్లడించారు. ఈ…
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీపై టీమిండియా స్పిన్నర్ చాహల్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఏడాది మెగా వేలంలో తనను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ ఈ హామీని ఆర్సీబీ తుంగలో తొక్కిందని చాహల్ విమర్శలు చేశాడు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ ఈ ఆరోపణలు చేశాడు. తాను ఆర్సీబీ టీమ్‌లో ఉండాలంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్లో తాను ఆర్సీబీని వీడి మరో…
TRS MLC Vullolla Gangadhar Goud Made Comments on Congress Leader Madhu Goud Yashki. ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ పరిస్థితి వేడెక్కింది. ఇటీవల రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కల్వకుంట్ల కవిత ఎన్నికల్లో చేసిన వాగ్దాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ.. మాట తప్పారంటూ.. ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేత మధుయాష్కీ కూడా ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ…