MLC VG Goud : మధు యాష్కీ ఒక పొలిటికల్ టూరిస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRS MLC Vullolla Gangadhar Goud Made Comments on Congress Leader Madhu Goud Yashki.
ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ పరిస్థితి వేడెక్కింది. ఇటీవల రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కల్వకుంట్ల కవిత ఎన్నికల్లో చేసిన వాగ్దాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ.. మాట తప్పారంటూ.. ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేత మధుయాష్కీ కూడా ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వుల్లోల గంగాధర్ గౌడ్ (వీకే గౌడ్) మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితపై విమర్శించే హక్కు మాజీ ఎంపీ మధుయాష్కీకి లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా మధు యాష్కీ ఒక పొలిటికల్ టూరిస్ట్ అంటూ విమర్శించారు. మధు యాష్కీకి తెలంగాణలో అసలు ఎం జరుగుతుందో తెలియదని, నీకు ఎమ్మెల్సీ కవిత మీద మాట్లాడే అర్హత లేదంటూ అగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- El Nino Impact : ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
- Hyderabad Police : హైదరాబాద్ పోలీసులకు 15 ఈవీ స్మార్ట్ కార్లు.. డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ప్రారంభం!
- NIMS Corruption : నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం.. ఒకేసారి మూడు శాఖల తనిఖీలు!
- Ration Rice Scam : బ్రాండెడ్ బియ్యం ముసుగులో రేషన్ దందా.. హైదరాబాద్‌లో భారీ స్కామ్
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీతో కుమ్మక్కయావని, డిపాజిట్ కూడా దక్క లేదన్నారు. రేవంత్ రెడ్డి, మధు యాష్కీ లది ఐరన్ లెగ్ అని, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడే షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసారన్నారు. పసుపు బోర్డు కోసం కేంద్రంలో ప్రభుత్వం లేకున్న ముఖ్యమంత్రులతో లేఖలు ఇప్పించిన ఘనత కవితదని ఆయన వెల్లడించారు. నువ్వు సపోర్ట్ చేసిన అరవింద్ బాండ్ పేపర్ తీసుకోని మోసం చేసాడని, దాని పై మాట్లాడు అంటూ ధ్వజమెత్తారు. మరోసారి ఎమ్మెల్సీ కవితపై మాట్లాడితే నిజామాబాద్‌లో ప్రజలు మిమ్మల్ని తిరగనివ్వరని హెచ్చరించారు.
తాజావార్తలు
-
ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
-
Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
-
Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
-
El Nino Impact : ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?