ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ త్వరలోనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 91 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే ఆర్థిక శాఖ మొదటి విడుత క్రింద 30,543 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగార్థులకు తీపికబురు చెబుతూ.. పలు సూచనలు చేసింది. అవేంటంటే.. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు.. దీనికోసం వెంటనే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి అని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.…
తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ భేటీకి సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నిర్వహించే సమావేశానికి తాను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా రాలేకపోతున్నానని, అధిష్టానానికి ముందస్తు సమాచారం ఇచ్చినట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క…
సెలబ్రిటీ హోదాను సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల. సమాజ హితమే కాకుండా పర్యావరణ హితమైన కార్యక్రమాల్లోనూ ఆమె చురుకుగా పాల్గొంటారు. హ్యూమన్ లైఫ్ తో పాటు వైల్డ్ లైఫ్ ను కాపాడాలనేది ఉపాసన ఆలోచన. ఈ దిశగా తన సేవలు అందిస్తున్న ఆపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్ ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డ్ దక్కింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన…
కింగ్ అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర బృందం దుబాయ్ లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ విశేషాలను దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెబుతూ, ”ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించాం. విజువల్స్, లొకేషన్స్,…
వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రంగరంగ వైభవంగా!’. తొలి చిత్రం ‘ఉప్పెన’తో సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకున్న వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మూడో చిత్రమిది. బాపినీడు బి సమర్పణలో గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్. ఈ చిత్రాన్ని మే 27న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా…
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇటీవల అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సంస్థలు ఎంతో బిజీబిజీగా గడిపారు. అంతేకాకుండా అమెరికాలో తన జ్ఞాపకాలను కూడా నెమరువేసుకున్నారు. అయితే కేటీఆర్ సోదరి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య కూడా అమెరికాలోనే విద్యనభ్యసిస్తున్నాడు. అమెరికా పర్యటనలో ఎంతో బిజీగా ఉన్న కేటీఆర్.. తన మేనల్లుడు ఆదిత్యను కలిసి కొంతసేపు గడిపారు. ఈ సందర్భంలోనే వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను…
ఇటీవల 40 లక్షల మందికి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ఒక్కొక్కరికి రెండులక్షల బీమా చేయించనున్నారు. మొత్తం 40లక్షల మందికి ఆరున్నర కోట్ల రూపాయల ప్రీమియం చెక్కును రాహుల్ గాంధీ చేతుల మీదుగా బీమా సంస్థలకు రేవంత్ రెడ్డి బృందం అందజేయనుంది. అయితే ఈ నెలతో సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగియనుంది. తెలంగాణలోని 32 వేల…
TDP MLC Ashok Made Comments on CM Jagan. చీప్ లిక్కరును కాస్ట్ లీ ధరలకు అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్న సీఎం జగన్ తాజాగా కాస్ట్ లీ కరెంట్ పథకం అమలుకు సిద్ధమయ్యారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం మార్చిన విద్యుత్ శ్లాబులతో 75యూనిట్ల కేటగిరిలో ఉన్నవారు నిన్నటివరకు రూ.169 కడితే, రేపట్నుంచి రూ.304 కట్టాలని, నెలనెలా కేటగిరీలు మారుస్తూ.. 13 శ్లాబుల్ని 6 శ్లాబులుగా…
ప్రభుత్వ విప్ బాల్కసుమన్ మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీకి తెలుగు రాదు… వీళ్ళు ఎవరో పంపితే పోస్టు చేసినట్టు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తెలంగాణ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ నిలబడలేదని ఆయన ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేసారని, విషయం లేక ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి…