మరో 2 రోజుల్లో ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్ల ఆఫర్ ముగియనుంది. కరోనా కష్టకాలంతో పాటు పేద, మధ్య తరగతి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పెండింగ్ చలాన్లపై పోలీస్ శాఖ రాయితీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. బైకులు 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని.. 75% చలాన్ అమౌంట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కార్లు, లైట్ మోటార్ వెహికల్స్‌కు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, తోపుడు బండ్లకి 80 శాతం రాయితీ కల్పించారు.. అయితే ఈ ఆఫర్ ఈ నెల 31 వరకే అయిపోనుంది.. అయితే పెండింగ్ ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్ కి భారీ స్పందన వచ్చినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది.
2.50లక్షల పెండింగ్ చలాన్‌లను వాహనదారులు క్లియర్ చేసుకున్నారు. 800 కోట్ల రూపాయల పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్లు పోలస్ శాఖ తెలిపింది. చలాన్ల క్లియరెన్స్ తో 240 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు పోలీస్ శాఖ పేర్కొంది. అయితే ఇప్పటికీ చలాన్లు క్లియర్ చేయని వారు మిగిలిన 2 రోజుల్లో క్లియర్ చేసుకోవాలని సూచించారు. గడువు పెంపు ఆలోచన లేదని, గడువు దాటితే చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.