నిన్న ఘర్ణణలో హత్యకు గురైన టీడీపీ బీసీ నాయకుడు జల్లయ్య కుటుంబ సభ్యులను ఫోన్‌లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తోంది సామాజిక అన్యాయమని, ఒక పక్క సామాజిక న్యాయ భేరి అంటూ బస్సు యాత్రలు చేస్తూ మరోపక్క బీసీ నాయకుల్ని పక్కా ప్రణాళికతో హత్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బీసీలు తనవైపు లేరనే కక్షతోనే తన సామాజిక వర్గం నేతల్ని బీసీ నాయకుల్ని…
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పరిసర గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే.. పెద్దపులిని బంధించడానికి ఫారెస్ట్ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. పశువులపై చేస్తున్న దాడి పరంపరను కొనసాగిస్తున్న పులి.. ఒమ్మంగి – శరభవరం గ్రామాల మధ్య రాత్రి మరోసారి సంచరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొదురుపాక పొలిమేరలో మరో ఆవు దూడపై పులి దాడి చేసినట్లు సమాచారం. అయితే.. సీసీ కెమెరాల్లో పులి విజివల్స్ రికార్డు అయ్యాయి.…
ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు పదోతరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అనివార్య కారణాల వల్ల పదో తరగతి ఫలితాలు విడుదల చేయలేపోతున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అయితే.. పదో తరగతి ఫలితాలు సోమవారం నాడు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మరికొన్ని గంటల్లో ఫలితాలు విడుదలవుతాయనుకన్న విద్యార్థులకు నిరాశే మిగిలింది. అయితే.. ముందుగా చెప్పినట్లుగా అనుకన్న…
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఓమొట్టు ముందుకు వెళ్లారు. రిలయన్స్ గ్రూపు షేరు విలువ రివ్వున దూసుకెళ్లడంతో ముఖేశ్ అంబానీ నికర సంపదలో పెరుగుదల చోటుచేసుకుంది. దీంతో.. వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో అంబానీ 8వ స్థానానికి ఎగబాకారు. ఈ క్రమంలో మరో భారత కుబేరుడు గౌతమ్ అదానీని వెనక్కి నెట్టారు అంబానీ. అంతేకాదు, ఆసియా సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని అంబానీ చేజిక్కించుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. ఈ జాబితాలో అంబానీ 8వ…
మాజీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం జైలులో తోటి ఖైదీపై దాడి చేశారని సమాచారం. ఏదో విషయంపై ఇద్దరికి మాటామాటా పెరగడంతో ఎమ్మెల్సీ కోపంతో అతనిపై చెయ్యి చేసుకున్నారని తెలుస్తోంది. అయితే.. నిబంధనల ప్రకారం జైలులో ఉన్న ఖైదీలపై చిన్న గీత పడినా అక్కడి ఆసుపత్రిలో కారణం…
మోడీ ప్రధానిగా అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేయడం దేశం గర్వించదగ్గ విషయమని ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు దేశ రక్షణ కోసం మోడీ చేసిన కృషి అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు. మన వైపు చూడాలంటే నే పాకిస్తాన్ భయపడే స్థితికి మోడీ తీసుకు వచ్చారని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్యంలో జనరిక్ మందుల ద్వారా తక్కువ ధరకు నాణ్య మైన…
నాడు మద్యపాన నిషేదమన్న జగన్.. ఇప్పుడు టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మిస్తున్నారంటూ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. మహిళలపై రోజూ దారుణాలు జరుగుతున్నా.. జగన్ మాత్రం నేను సీఎంను కాదు, నాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. వైసీపీ నేతలు, వాలంటీర్లే కాలకేయుల్లా.. మారి మహిళలపై అత్యాచారాలు, దాడులకు తెగబడుతున్నారి ఆమె మండిపడ్డారు. వైసీపీ 3 ఏళ్ల పాలనపై కేకులు కట్ చేస్తున్న వైసీపీ…
అక్కడ ఒక బకెట్ నీళ్లుకావాలన్నా బావిలోకి దిగాల్సిందే.. ఎలాంటి సాయం లేకుండా కేవలం బావిలోని రాళ్లనే మెట్లుగా చేసుకొని ఎక్కడం దిగడం చేయాల్సిందే.. ఎక్కటప్పుడో దిగేటప్పుడో ప్రమాదవశాత్తు కాలజారితే భారం అంతా భగవంతుడిపైనే.. నీటి ఎద్దడికి నిలువుటద్దంలా ఓ మహిళ బావిలో దిగి నీళ్లు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరతను ఈ వీడియో సాక్షిబూతమవుతోంది. వీడియోలో ఓ మహిళ నీటి కోసం ఎలాంటి తాడు, నిచ్చెన సాయం…
జగన్ సర్కార్ 3 ఏళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదు అని టెండర్లో నిబంధన పెట్టడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర పరువు తీసేలా ఉంది.. దీనికి సీఎం జగన్ సిగ్గుపడాలి అంటూ ఆయన ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దని టెండర్ డాక్యుమెంట్ లోనే నిబంధన పెట్టడం రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు…
ఏపీలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్ష ఎంత గందరగోళాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్రాలు లీక్ కావడంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎట్టకేలకు నిర్వఘ్నంగా ముగిసిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా…