కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పరిసర గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే.. పెద్దపులిని బంధించడానికి ఫారెస్ట్ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. పశువులపై చేస్తున్న దాడి పరంపరను కొనసాగిస్తున్న పులి.. ఒమ్మంగి – శరభవరం గ్రామాల మధ్య రాత్రి మరోసారి సంచరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొదురుపాక పొలిమేరలో మరో ఆవు దూడపై పులి దాడి చేసినట్లు సమాచారం. అయితే.. సీసీ కెమెరాల్లో పులి విజివల్స్ రికార్డు అయ్యాయి.
పులి అడుగులను సైతం బేస్ క్యాంపులో ఉన్న ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఒమ్మంగి, పొదురుపాక, శరభవరం పొలిమేరల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు ఆవు మాసంతో ఏర్పాటు చేసిన బోను వద్దకు వచ్చి పులి వెళ్ళిపోవడంతో.. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ, ఎన్‌టీసీఏ రిస్క్యూ బృందాలు నిమగ్నమయ్యాయి. పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు నిపుణులను రంగంలో దించుతున్నారు.