Bharat Mobility Expo: డియో లవర్స్‌కి శుభవార్త.. స్పోర్టీ లుక్స్, మంచి మైలేజ్..
- కొత్త డియో విడుదల
- పలు మార్పులు చేసిన కంపెనీ
- రూ.74,930 నుంచి ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హోండా తన పాపులర్ డియో స్కూటర్ యొక్క 2025 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,930గా నిర్ణయించింది. దీని ధర ప్రస్తుత మోడల్ కంటే దాదాపు రూ. 1500 ఎక్కువ. 2025 వెర్షన్‌లో జపాన్ కంపెనీ దానిలో పలు మార్పులు చేసింది. OBD2B కంప్లైంట్ ఇంజిన్‌ను అందించింది. ఈ 110cc సింగిల్-సిలిండర్ పాత మోడల్‌కు సమానమైన పవర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. CVT గేర్‌బాక్స్‌లో ఎలాంటి మార్పు లేదు. కంపెనీ తన మైలేజ్ కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదు.
2025 డియో స్కూటర్ ఫీచర్లు..
ఇది 4.2-అంగుళాల టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. వేగం, ట్రిక్ మీటర్, రేంజ్ మొదలైనవాటితో పాటు మైలేజీని కూడా స్పష్టంగా చూపుతుంది. ఇందులో టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇది స్టాండర్డ్ (STD), డీలక్స్ (DLX) అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. డీలక్స్ ధర రూ.85,648గా కంపెనీ తెలిపింది. ఎందుకంటే ఇందులో అన్ని ఫీచర్లతో పాటు మెరుగైన గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. కాగా.. దేశ వ్యాప్తంగా దీని బుకింగ్ ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరులో డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా.. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.74,930గా నిర్ధారించింది.
Also Read
- TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
లుక్, డిజైన్ దాదాపు పాతదే?
లుక్, డిజైన్ పరంగా, ఇది చాలావరకు మునుపటి మాదిరిగానే ఉంది. దాని టాప్ డీలక్స్ వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్ అందించారు. ఇది కాకుండా.. ఈ స్కూటర్ మొత్తం 5 రంగులలో లభిస్తుంది. ఇందులో ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ + పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, మాట్ మార్వెల్ బ్లూ, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.
కస్టమర్ల అవసరాలను తీరుస్తుంది..
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, సీఈవో సుట్సుము ఒటాని మాట్లాడుతూ.. “హోండా డియోను స్పోర్టి లు,క్ శక్తివంతమైన పనితీరు కనబరిచే విధంగా కొత్త 2025 డియోను మునుపటి కంటే మెరుగ్గా చేశాం. చాలా కొత్త ఫీచర్లు ఇందులో చేర్చాం. ఈ స్కూటర్ కస్టమర్ల అవసరాలను తీరుస్తుందని కంపెనీ భావిస్తోంది” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!