కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈనెల 8న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు. తాజాగా విచారణ జరిగింది.
భార్యాభర్తల మధ్య సంబంధాలు చాలా క్లిష్టంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ సంబంధంలో పరస్పర సమన్వయం ఏర్పడటానికి చాలా సమయం పడుతుంది. ఇద్దరి మధ్య ప్రేమతో పాటు వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే.. చాలా మంది భర్తలు తమ భార్యల మాటలను సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా గొడవలు జరుగుతాయి. కాగా.. కొన్ని పనులు భార్యలకు అస్సలు నచ్చవు. దీంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుంటా. ఆ అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటి పనుల్లో…
నాచారం పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. సురానా వైర్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఖమ్మంలో గత రెండు రోజుల క్రితం అదృశ్యం అయి కాలువ లో మృత దేహంగా లభ్యం అయిన సంజీవ్ కుమార్ అనే యువకుడి ఘటన విషాదాంతం అయ్యింది. పండుగ రోజున తన సోదరుని బైక్ పై తీసుకురావడానికి ఇంటి నుంచి వెళ్లి మృత్యు వాత పడ్డారు. తన సోదరుడికి వాయిస్ మెయిల్ పంపించాడు. ఒక మహిళను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తున్నారని నన్ను ఆటోతో కొట్టి చంపేస్తున్నారని వాయిస్ మెయిల్ లో సోదరుడికి పెట్టారు.
మద్యం పానం ఆరోగ్యానికి హానికరం.. అని ఎన్ని సార్లు చెప్పినా కొంత మంది పెడచెవిన పెడతారు. అయితే.. మద్యం తాగిన తర్వాత అది నేరుగా పొట్టలోకి వెళ్లి మూత్రం రూపంలో శరీరాన్ని వదిలి వెళుతుందని చాలా మంది భావిస్తారు. అది శరీరంలోకి వెళ్లిన తర్వాత అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. ఎంత తాగుతున్నారు? ఎప్పుడు తాగుతున్నారు? ఎంత కాలం నుంచి తాగుతున్నారు? అన్న విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్…
రాచకొండ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠా నుంచి మూడు తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠాగా గుర్తించారు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నారు. హైదరాబాదులో తుపాకులు విక్రయించేందుకు ఈ ముఠా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గన్స్ కోసం ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారా? అని ఆరా తీస్తున్నారు. ముఠా…
తెలంగాణ రాష్ట్రం బైంసా నుంచి ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులోని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడు.. కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం దుర్పత్తిగా గుర్తించారు. సజీవ దహనం ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈనెల 8న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయగా.. క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
నార్సింగి పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో హత్యకు గురైన జంట కేసులో ట్విస్ట్ నెలకొంది. నార్సింగి పోలీస్ స్టేషన్ డబుల్ మర్డర్ కేసులో పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది.
తమిళనాడులో మంగళవారం ఉదయం రైలు ప్రమాదం తప్పింది. పుదుచ్చేరికి వెళ్తున్న మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. విల్లుపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు. లోకో పైలట్ దానిని చూసి వెంటనే రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు గంటల్లోనే రైలు రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పడానికి గల కారణాలు విచారణ పూర్తయిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు.…