ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ఎంత చెప్పినా కొందరు మాత్రం అంత త్వరగా మానరు. అయితే.. ప్రస్తుతం యువత వాటికి బానిసలుగా మారుతున్నారు. టీతో పాటు ఓ సిగరెట్ తాగుతూ.. ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఓ అధ్యయనం వారికి కీలక విషయాన్ని తెలిపింది. ప్రముఖ యురాలజిస్ట్ మార్క్ లానియాడో ‘మిర్రర్’ గతంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ధూమపానం వల్ల పురుషాంగం కుచించుకుపోవడమే కాకుండా అంగస్తంభన సమస్యలు కూడా తలెత్తుతాయని పేర్కొన్నారు. ‘‘అంగం స్తంభించాలంటే అక్కడ రక్త ప్రసరణ సక్రమంగా ఉండాలి. అయితే ధూమపానం చేసేవారి రక్తం నాళాల్లో అథెరోస్క్లెరోసిస్ (ధమనుల గోడలపై కొవ్వులాంటి పదార్థాలు) ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అవి రక్త ప్రసరణను అడ్డుకుంటాయి’’ అని తెలిపారు.
READ MORE: Production No 32 : #90స్ కి సీక్వెల్ సిద్ధం… హీరో ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సిగరెట్‌లో ఉండే రసాయనాలు కూడా అంగంపై దుష్ప్రభావం చూపుతాయట. అందులో ఉండే నికోటిన్ వల్ల రక్తనాళాలు సన్నగా మారిపోతాయట. తాత్కాలికంగా లేదా శాస్వతంగానైనా ఈ ముప్పు ఉండవచ్చు. దీనివల్ల స్మోకింగ్ చేసేవారి పురుషాంగం కుచించుకుపోతుంది. అంగస్తంభన కూడా ఆశించిన స్థాయిలో ఉండదు. ఉదయం నిద్రలేచే సమయంలో కూడా అంగస్తంభన కలగదు. ఎప్పుడైతే అంగానికి రక్తసరఫరా నిలిచిపోతుందో అప్పుడు దాని పరిమాణం కూడా తగ్గిపోతుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉన్నప్పుడే అంగం గట్టిపడి పొడవుగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది కేవలం పురుషులకే కాదు.. మహిళలకూ వర్తిస్తుంది. మహిళల యోనీలో ప్రేరేపణకు కూడా రక్త ప్రసరణ అవసరం.