టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. భారత్ విజయంలో విరాట్ కోహ్లీ 76 పరుగులు చాలా కీలకం.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను టీడీపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వేడుకల్లో సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు తిరుపతితో ఎంతో అనుబంధం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని, ఆయన ఓ సమగ్ర సమతా మూర్తి అని ఎన్వీ రమణ కొనియాడారు. రైతుబిడ్డగా, రంగస్థల నటుడిగా, కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగారని, ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని…
ఇటీవల ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన పదో తరగతి ఫలితాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పదో తరగతి విద్యార్థులో జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఉన్నట్టుండి ఈ జూమ్ మీటింగ్‌లో వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలు విద్యార్థుల లాగిన్ ఐడీలో నారా లోకేశ్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్‌లోకి వచ్చినట్లు టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే…
ప్రతి ఉద్యోగి జీవితంలో రిటైర్మెంట్ అనేది అనివార్యం. అయితే.. ఇంచుమించు ఇంటితో సమానంగా ఉద్యోగ సమయంలో కార్యాలయాలలో గడుపుతుంటారు. అంతేకాకుండా ఆఫీసులోని సహోద్యోగులకు పెరిగిన బంధం కూడా తక్కువేం ఉండదు. అయితే.. ఇదే పదవి విరమణ ఉపాధ్యాయులకు మరింత ప్రత్యేకమని చెప్పాలి. పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులకు ఉండే అనుబంధం అంతాఇంతా కాదు. ఉపాధ్యాయులు బదిలీపై వెళుతుంటే.. వెళ్లవద్దంటూ ఏడ్చేసిన సంఘటన కొన్ని వైరల్ అయ్యాయి కూడా. అయితే ఇప్పుడు చెప్పేది కూడా అలాంటిదే.. తను 22 ఏళ్ల…
వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నేతలు గడపగడపకు కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున తెలుసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమం ఆలస్యంగా తిరుపతి లో ప్రారంభించామన్న కరుణాకర రెడ్డి.. ప్రతి గడప గడప కార్యక్రమానికి ప్రతి ఇంటి…
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఇకపై ప్రతి టికెట్‌పైనా 2 శాతం కమీషన్ వసూలు చేయనుంది. ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో.. ఇక నుంచి రాష్ట్రంలోని ఏ మూలన సినిమా చూడాలన్నా ఈ పోర్టల్ ద్వారానే టికెట్లను కొనుగోలు చేయాల్సిందే. ప్రైవేటు…
వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ఇవాళ మూడో రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు పోలీస్ ఐలాండ్ సెంటర్ లో విగ్రహాలకు నివాళులు అర్పించి మూడో రోజు యాత్రను మంత్రులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్టీవో మాట్లాడుతూ… చంద్రబాబుకు ఎప్పుడూ శాపనార్థాలు పెట్టడం మినహా ఇంకేం వచ్చు అంటూ ఆయన ధ్వజమెత్తారు. రోజూ మాట్లాడిన విషయాలు కాకుండా చంద్రబాబు కొత్తగా ఏమైనా చెప్పాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మనసులో జగన్ దూరిపోయి చెప్పాడా…
ప్రధాని మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫెక్సీలు వెలిశాయి. హైదరాబాద్ నగరంలో 17 చోట్ల ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధి సహాయం చేయడంలో ప్రధాని విఫలమయ్యారంటూ ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. మోడీని నేరుగా కలిసి కేసీఆర్ అడగవచ్చు కదా.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ముఖం చెల్లక సీఎం…
263 మంది చైనా సంతతికి చెందిన వ్యక్తులకు అక్రమ వీసాలు మంజూరు చేయించిన వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇదే విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేపడుతోంది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే.. ఈడీ తాజాగా కేసు పెట్టింది. అయితే.. మరోవైపు, ఈ వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరాన్ని నేడు సీబీఐ విచారించనుంది. విచారణలో పాల్గొనాల్సిందిగా గతంలో కార్తీ చిదంబరానికి సమన్లు జారీ…