ప్రధాని మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫెక్సీలు వెలిశాయి. హైదరాబాద్ నగరంలో 17 చోట్ల ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధి సహాయం చేయడంలో ప్రధాని విఫలమయ్యారంటూ ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. మోడీని నేరుగా కలిసి కేసీఆర్ అడగవచ్చు కదా.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ముఖం చెల్లక సీఎం బెంగళూరు వెళ్లారని, ఏక్తా యాత్రలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నామన్నారు. మసీదులని తవ్వితే శివలింగాలు వచ్చిన మాట వాస్తవం కాదా అని ఆయన అన్నారు. ప్రధాని మోడీ పర్యటన కోసం మేము పర్మిషన్ తీసుకున్నామని, బేగంపేట ఎయిర్ పోర్టులో వెల్ కమ్ చెప్పేందుకు సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ సభకు వచ్చే బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవరిస్తే డీజీపీ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్తామని, ఆఫీసు ను ముట్టడిస్తామన్నారు.