తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రైతు రచ్చబండ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లా్ల్లో కొనసాగుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఎన్నో వాగ్ధానాలు చేశారు.. సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులే కొనసాగుతున్నాయి కానీ.. కొత్తవేమి లేవని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇచ్చిన హామీ 8 ఏండ్లు అవుతున్నా ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లో బిజీ అయ్యి… ఇచ్చిన హామీలు…
ఎంజీఎం హాస్పటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ పరికరాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎస్ ఎమ్మెల్యే భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, బస్వరాజు సారయ్య లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎంజీఎంకు వచ్చే రోగులకు అత్యాధునిక వైద్య విధానం అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలతో అత్యాధునిక సిటీ స్కాన్ అత్యవసర విభాగం వద్ద ఏర్పాటు…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో గత రెండు రోజులుగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే డ్రైవర్ సుబ్రమణ్యం మృతిపై సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం మరణం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, సంఘటన జరిగిన వెంటనే, ప్రక్కదారి పట్టకుండా, చట్టం క్రింద అంతా సమానులే అంటూ బాధ్యులు ఎవరైనా శిక్షపడాల్సిందే అన్న…
ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అమలు కోసం ఉద్యోగుల వేతనాలనుండి 2 శాతం చందా చెల్లిస్తామని టీఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకారపత్రం ఇవ్వడాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) స్టీరింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. 2 శాతం చందా అంగీకారం కాదని, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ కోరింది. సంక్షేమ రాజ్యంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత పూర్తిగా ఆయా…