జాతీయ స్థాయిలో టెక్నాలజీ, వినియోగంలో తాజాగా మరో 15 అవార్డులను ఏపీ పోలీస్ శాఖ దక్కించుకుంది. టెక్నాలజీ సభ- 2022 ప్రకటించిన అవార్డులలో 15 అవార్డులను వివిధ విభాగాల్లో కైవసం చేసుకొని, మొత్తం 165 అవార్డు లను ఏపీ పోలీస్ శాఖ గెలుచుకుంది. టెక్నాలజీ వినియోగంలో జాతీయస్థాయిలో 165 అవార్డులతో మొదటి స్థానంలో ఏపీ పోలీస్ శాఖ నిలిచింది. టెక్నాలజీ వినియోగిస్తూ జాతీయ స్థాయిలో అవార్డుల దక్కించుకోవడంతో మాపై ప్రజలకు సేవ చేసే బాధ్యత మరింతగా పెంచిందని…
దర్శకుడు వి.రామచంద్రరావు తెరకెక్కించిన చిత్రాల సంఖ్య తక్కువే. కానీ, సదరు చిత్రాలతోనూ ఆయన అలరించిన తీరు చాలా ఎక్కువనే చెప్పాలి! కృష్ణను స్టార్ హీరోగా నిలపడంలో రామచంద్రరావు తెరకెక్కించిన “నేనంటే నేనే, అసాధ్యుడు, అమ్మాయిగారు-అబ్బాయిగారు, గంగ-మంగ” వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక యన్టీఆర్ తో కృష్ణ నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’, కృష్ణ 100వ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’కు కూడా రామచంద్రరావే దర్శకులు. ‘అల్లూరి సీతారామరాజు’ షూటింగ్ లో ఉండగానే ఆయన కన్నుమూశారు. ఆయన రూపొందించిన “అమ్మమాట,…
ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులను యావత్తు ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై వార్ డిక్లర్ చేయకనే చేశారు. అయితే దీనిపై ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోరాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా ఉక్రెయిన్ వ్యవహారంలో తలదూర్చితే ఎక్కడివరకైనా పోయేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పుతిన్ సంకేతాలు పంపారు. అయితే ఎప్పటినుంచో అగ్రరాజ్యం అమెరికా, రష్యాలకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమెరికా ఎలాంటి…
జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూర్ గ్రామానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెళ్లారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న బద్ధం నిహారిక కుటుంబ సభ్యులతో బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఉక్రెయిన్ లో ఉన్న బద్దం నిహారిక తో వీడియో కాల్ లో మాట్లాడి అక్కడి పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. రష్యా దాడులతో నిన్న రాత్రి నుండి భయం భయంగా గడుపుతున్నామని నిహారిక వాపోయారు. తాను ఉన్న దగ్గర పరిస్థితి కొంత…
ఐక్కా(IKEA) స్వీడిష్ గృహోపకరణాల రిటైలర్, సుసానే పుల్వెరర్‌ను తన భారతదేశ వ్యాపారం కోసం దాని కొత్త మరియు మొదటి మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మరియు చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ (CSO)గా నియమించింది. సుసానే అవుట్‌గోయింగ్ ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఐక్కా ఇండియాలోని సుసానే పుల్వెరర్ ఇంగ్కా గ్రూప్‌లో ఇంతకుముందు గ్రూప్ బిజినెస్ రిస్క్ మరియు కంప్లయన్స్ మేనేజర్‌గా పనిచేశారు. సుసానే 1997లో ఐక్కాలో చేరారు. ఐక్కాలో సుసానే విభిన్న…
ఉక్రెయిన్, రష్యా మధ్య క్షణక్షణానికి పరిస్థితులు మారుతున్నాయి. ఉక్రెయిన్‌లో నెలకొన్ని గందరగోళ పరిస్థితుల్లో అక్కడి చిక్కకున్న భారత పౌరులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు సమీపిస్తున్నాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ భవనాలను ఆధీనంలోకి తీసుకోవాలని రష్యా యోచినలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని భారత్ భావిస్తోందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌లో…
ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటు కొత్తవి కలిపి 215 కంపెనీల నుంచి లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.6,400 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ విజయం సాధించిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనివల్ల అదనంగా 34,000 మందికి ఉపాధి లభించిందని, గత ఏడాదితో పోల్చితే 100 శాతం పెట్టుబడి ఎక్కువైందని ఆయన వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ అయిన బయోఏషియా 19వ ఎడిషన్‌ను ప్రారంభిస్తూ, కోవిడ్ ఆరోగ్య సంరక్షణ రంగంపై దృష్టి…
ఉక్రెయిన్ లోని తెలంగాణ విద్యార్థులందరినీ క్షేమంగా తీసుకురావాలని కేంద్ర మంత్రి కార్యాలయానికి ఇప్పటికే లేఖ రాశామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎప్పటికప్పుడు విదేశీ దౌత్య అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఎవరూ టెన్షన్ పడొద్దని తల్లిదండ్రులను కోరారు. ఉక్రెయిన్ లో ఉన్న 20 వేల మంది భారతీయ విద్యార్థినీ, విద్యార్థులను తరలించేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే విదేశీ దౌత్య అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, ఉక్రెయిన్ లో నివసిస్తున్న,…
ఉక్రెయిన్‌లో చోటు చేసుకుంటున్న యుద్ధ పరిస్థితులతో అక్కడికి చదువుకునేందుకు వెళ్లిన తెలంగాణ యువత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకునేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వెళ్లారు. అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ళ అజయ్ కుమార్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఐదేళ్ల క్రితం ఎంబీబీఎస్ చదివేందుకు అజయ్ కుమార్ ఉక్రెయిన్ వెళ్లాడు. మరో మూడు నెలలు అయితే అజయ్ కుమార్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చే వాడు. ఇంత లోనే…
తెలంగాణాకే తలమానికమైన మేడారం సమ్మక్క-సార్క జాతర ఈ ఏడాది వైభవోపేతంగా జరిగింది. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం జాతర కన్నుల పండువగా సాగింది. అయితే మేడారం జాతర హుండీల లెక్కింపును బుధవారం ప్రారంభించారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు…