Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్‌పై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: భారత ప్రభుత్వం, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది. కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం మెటాకు మరోసారి నోటీసులు జారీ చేయగా, తాజాగా హైదరాబాద్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలువురు సోషల్ మీడియా యూజర్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఓ వీడియోను AI (కృత్రిమ మేధ) సాంకేతికతతో మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో వ్యాప్తి చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. సీజేపీ నిరసన సమయంలో ప్రధాని మోడీ షేర్ చేసిన వీడియోను కొందరు AI సహాయంతో ఎడిట్ చేసి, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేశారని పోలీసులు తెలిపారు. మెటా యాజమాన్యంలోని ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ మార్ఫింగ్ వీడియోలు వైరల్ అయినట్లు విచారణలో తేలింది.
ఈ విజువల్స్ ప్రజలను తీవ్రంగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, నూతన భారతీయ న్యాయ సంహిత (BNS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (IT Act) నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ డీప్‌ఫేక్ వీడియోలను ఎవరు సృష్టించారు? సోషల్ మీడియాలో ఇవి అంత విస్తృతంగా ఎలా వ్యాపించాయి? ప్లాట్‌ఫామ్స్ వద్ద ఉన్న భద్రతా చర్యలు వీటిని అడ్డుకోవడంలో సరిపోలేదా? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. వీటిని రూపొందించి, షేర్ చేసిన ప్రతి ఒక్కరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ప్రతినిధులను పిలిపించి, ప్లాట్‌ఫామ్‌లలో AI స్కామ్‌లు, నకిలీ ప్రకటనలు, మార్ఫింగ్ కంటెంట్‌ను గుర్తించి తొలగించే ప్రక్రియపై వివరణ కోరారు. దీనిపై స్పందించిన మెటా ప్రతినిధులు అధికారుల ముందు హాజరై, తమ వద్ద ఉన్న కంటెంట్ మోడరేషన్ విధానాలు, నిబంధనల వివరాలను సమర్పించారు. ప్రస్తుతం ఈ విచారణ ప్రాథమిక దశలోనే ఉందని పోలీసులు స్పష్టం చేశారు. డిజిటల్ ఆధారాల ప్రకారమే అన్ని ఆరోపణలను పరిశీలిస్తామని, ప్రస్తుతం ఎవరిపై నేరం రుజువు కాలేదని, దర్యాప్తు ఫలితాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.
Also Read
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
తాజావార్తలు
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!