ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్ని యుద్ధ పరిస్థితులతో అక్కడ చిక్కుకునన భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్ ఎంబీసీతో పాటు.. సంబంధింత అధికారులతో మాట్లాడుతూ.. భారతపౌరులను దేశానికి తీసుకువచ్చేందుకు ఇండియన్ ఎంబసీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతపౌరులు ఉక్రెయిన్ సరిహద్దు దాటి పోలెండ్ కు చేరుకుంటే అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలెండ్ రాజధాని భారత రాయబార కార్యాలయం భారత్ పౌరులు, విద్యార్థులకు పలు సూచనలు జారీ చేసింది.
ఉక్రెయిన్ నుంచి పోలాండ్ వైపు నడక దారిలో వెళ్లే వారు శేహనీ – మేద్యక మధ్య సరిహద్దు దాటాలని సూచన చేసింది. అంతేకాకుండా సొంత వాహనాల్లో వచ్చే వారు “క్రాకో వీక్” ద్వారా సరిహద్దు దాటాలని సూచనలు జారీ చేసింది. అయితే గూగుల్ మ్యాప్ ల ద్వారా తమ వివరాలు భారత రాయబార కార్యాలయానికి అందించాలని, ఆ వివరాలను ఆధారంగా విమానాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది.