ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సెక్రటేరియట్ ప్రపంచమే అబ్బుర పడే విధంగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సచివాలయ పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మెయిన్ గ్రాండ్ ఎంట్రీ,బేస్మెంట్ ఎలివేషన్, కోర్ట్ యార్డ్,జిఆర్సీ కాలమ్స్ క్లాడింగ్,కాంపొండ్ వాల్ అర్నమెంట్ గ్రిల్,ఫాల్ సీలింగ్,గ్రౌండ్ ఫ్లోర్ కారిడార్,గ్రానైట్స్ ఫ్లోరింగ్ డిజైన్,ఫైర్ సేఫ్టీ వర్క్స్, ఎంట్రన్స్…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు అని బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రుల తరపున మోడీకి బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం అక్కడ చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన కలిగించిందని, ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురిఅయ్యారని ఆయన అన్నారు.సరిగ్గా ఈ సమయంలో మోడీ తన రాజకీయ చతురతతో విద్యార్థులను ప్రత్యేక విమాన…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న జనం ముందు నిలచింది. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.36.37 కోట్లు వసూలు చేసి విజయశంఖం పూరించింది. ఒక్క అమెరికాలోనే మొదటి రోజు మిలియన్ డాలర్లు పోగేసింది. అంటే మన కరెన్సీలో రూ.7.05 కోట్లు. ఇక ఇతర రాష్ట్రాలు, పరదేశాల్లో కలిపి రూ. 2.90 కోట్లు వసూలు చేసింది. అంటే తెలుగు రాష్ట్రాలలో కాకుండానే మొత్తం రూ.9.95 కోట్లు కొల్లగొట్టింది.…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ఆది నుంచే సమస్యలకు నెలవైంది. ధరణి పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచి దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎంతో మంది రైతులు పేర్లు మారిపోవడం.. గుంట స్థలం ఉన్నవారికి ఎకరా స్థలంగా నమోదైతే.. ఇక ఎకరాల భూమి ఉన్న రైతు గుంట స్థలానికి యజమానికిగా చూపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పడు అధికారులు ధరణి పోర్టల్‌ను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్…
మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సాయిబాబానగర్‌లో ఏటీఎం నగదుతో ఉడాయించిన డ్రైవర్ సాగర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు నగరాలు తిరిగిన అనంతరం నగరంలో జేబీఎస్ బస్టాండ్‌లో డ్రైవర్ సాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19వ తేదీన రైటర్స్ సంస్థ సిబ్బంది ఏటీఎంలో నగదు నింపటానికి వెళ్లారు. ఆ సమయంలో డ్రైవర్ సాగర్ 36 లక్షలతో పరారయ్యాడు. వాహనాన్ని నర్సాపూర్ అడవిలో వదిలేసి నగదుతో వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. వివిధ బస్సులు మారుతూ…
‘ఏం మాయ చేశావె’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ సినిమా శనివారంతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన 12 ఏళ్ల జర్నీని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సమంత. ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే… లైట్లు, కెమెరా, యాక్షన్ ఇలా సాటిలేని క్షణాల చుట్టూ తిరిగే 12 సంవత్సరాల జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఈ…
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతలు ట్విట్టర్ వేదిక విమర్శలు గుప్పించుకుంటునే ఉన్నారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానంలో అడుగుపెట్టి 44 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు శుభాకాంక్షలు తెలుపుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు… కొంగర పట్టాభిరామ చౌదరిపై నెగ్గారు. చంద్రబాబు ప్రజాప్రస్థానంపై టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఓ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.…
హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అయిన ప్రతి నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులు పట్టుబడుతూనే ఉన్నారు. ఇటీవలే బిజినెస్ మన్ లు వైద్యులు, ఇప్పుడు తాజాగా ఐ టి ఎంప్లాయిస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న సిటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులకు పట్టుబడ్డారు. డ్రగ్స్ కేసులో ఎవరి ప్రమేయం ఉన ఎంతటి వారినైనా వదిలేది లేదని నగర పోలీస్ బాస్ హెచ్చరించారు నార్కోటిక్స్…
బాలీవుడ్ లో కంగనా రనౌత్ విమర్శల నుంచి తప్పించుకున్న వారు బహు అరుదు. ఇక వారసులను అయితే కంగనా ఓ ఆట ఆడుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా ఎన్నో మార్లు ఆలియా భట్ పై విమర్శల జల్లు కరిపించింది. ఆలియాను వారి కుటుంబసభ్యులతో కలపి ‘బాలీవుడ్ మాఫియా గ్యాంగ్’ అనేసింది కూడా. ఇక ఆలియా నటించిన ‘గంగూబాయి’ సినిమా రిలీజ్‌కు ముందు 200 కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా ఖర్చు అంతా బూడిదలో పోసిన…
నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలో ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ఈ ప్రమాదంలో మహిమ అనే మహిళ పైలట్ మృతి చెందింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది.. వైద్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర విమాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వట్టర్లో స్పందింస్తూ.. తెలంగాణలోని నల్గొండలో శిక్షణ విమానం కూలిన ఘటన విని షాక్‌కు గురయ్యారు. ఘటనా స్థలానికి దర్యాప్తు…