ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న ఘర్షణ వైఖరి రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతోంది. సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని తరలించింది రష్యా. రెండు లక్షల మందికి పైగా సైన్యాన్ని చేరవేసింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి అగ్రరాజ్యం అమెరికా చేస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదు. ఈ నేపథ్యంలో కైవ్‌లోని తన రాయబార కార్యాలయాన్ని రష్యా ఖాళీ చేయడం ప్రారంభించింది. బుధవారం మధ్యాహ్నం నాటికి,…
నిజామాబాద్ మార్కెట్లో ఈ రోజు పసుపు పంటకు క్వింటాల్ కు 10 వేల రూపాయలు ధర పలికిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పడ్డ అకాల, అతి వర్షాలకు పసుపు పంట చాలా వరకు దెబ్బతిన్నదని ఆయన అన్నారు. పంట కుళ్లి పోయిన రైతులు చాలా వరకూ నష్టపోయారని, అలాంటి పంట తక్కువ ధర పలుకుతుందని, అలాంటి రైతులను ఆదుకోవాలని ఇప్పటికే నేను ముఖ్యమంత్రి కి లేఖ రాయడం…
తెలంగాణా ప్రభుత్వ నిర్లక్ష్యం, కావలసిన నిధులు మంజూరు చేయకపోవడంతో బహుళ మోడల్ రవాణా వ్యవస్థ (Multi Model Transport System) రెండవ దశ పనులు నిలిచి పోయాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ పనులు త్వరిగతినా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈరోజు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. రెండవ దశలో రైళ్లు రాయగిరి (భువనగిరి జిల్లా) వరకు పొడిగించుటకుకేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారుచేసి, రాష్ట్ర ప్రభుత్వం…
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించుటకై తక్షణమే నోటిఫికేషన్స్ వేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI)అధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు ఈ నెల 25న జరిగే ధర్నాకు నిరుద్యోగ యువత హాజరై జయప్రదం చేయాలని డీవైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్‌లు పిలుపునిచ్చారు. బుధవారం డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్స్ వేయకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కాలాయాపన చేస్తుండడంతో…
సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చేశానని చెప్పడం పచ్చి అబద్ధం చెబుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణ తెలంగాణ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రాణహిత – చేవెళ్ల క్లోజ్ చేశారని ఆయన విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతలను ఆపేశారు. పాలమూరు రంగారెడ్డి అలైన్మెంట్ మార్చి .. ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు అని ఆయన అన్నారు. వికారాబాద్ ను ఔషధ…
మహబుబాబాద్ జిల్లాలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ చేపట్టిన ఒక రోజు ఉక్కు దీక్ష విరమణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ సిగ్గులేకుండా జనంలో తిరుగుతుందని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు కంటే బయ్యారం ఉక్కు నాణ్యమైనదని ఆయన వెల్లడించారు. బండి సంజయ్ గుండు పై ఇనుప గుండ్లు పెడుతామని ఆయన అన్నారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బీజేపీ ఎంపీలు…
గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి యావత్త ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. అయితే ఇటీవల ఒమిక్రాన్ వేరియంట్ సృష్టించిన థర్డ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే భారతదేశం బయటపడుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఓమిక్రాన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తి స్థాయిలో భౌతిక విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఓమిక్రాన్ సైలంట్ కిల్లర్ అని ఎన్వీ రమణ…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్లు నాయకులు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ నేడు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీజేపీ నేత రవీంద్ర నాయక్ కౌంటర్ వేశారు. రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అని కేసీఆర్ కుటుంబాన్ని మాత్రం బంగారం చేసుకున్నాడని ఆయన విమర్శించారు. అంతేకాకుండాఇప్పుడు బంగారు భారత దేశం అంటున్నాడు కేసీఆర్.. సెంటిమెంటు రగల్చేందుకు ప్రయత్నం…
బైక్, కార్ ఇలా తాము వాడే వాహనంపై చలాన్లు ఉండటం.. రోడ్డుపైకి రాగానే పోలీసులు ఏ పక్క నుంచి వచ్చి ఆపి చలాన్ కట్టమంటారోనని భయంతో కాలం వెళ్లదీస్తున్న ఎంతో మంది వాహనాదారులకు హైదరాబాద్ పోలీసులు శుభవార్త చెప్పారు. పెండింగ్ చలానాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల హైదారబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు సమావేశమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న చలానాలకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ మార్చి 1…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పూడ్ సేఫ్టీ అధికారులు, తూనికలు, కొలతలు శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రాజమండ్రిలో ప్యారడేజ్ హోటల్ పై అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న హోటల్ నుండి చికెన్ తీసుకుని వచ్చి రాజమండ్రి హోటల్ లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వినియోగదారుడు పెమ్మనబోయిన రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు పై అధికారులు స్పందించి ఈ తనిఖీలు చేశారు. అయితే హైదరాబాద్ నుండి హోటల్ కు దిగుమతి చేసుకుని…