తనను, తన కుటుంబాన్ని అవమానపర్చే విధంగా కథనాలను ప్రచురించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరువు నష్టం దావా వేశారు. సాక్షి పత్రికలో తనను కించపరుస్తూ కథనాలను ప్రచురించినందున 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు విశాఖకు నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. కేసు వచ్చే నెల 14 వాయిదా వేసారని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావోద్దని కోర్టు తెలిపిందన్నారు. తప్పుడు…
టిడ్కో ద్వారా కేటాయించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అమలు చేయాలని కోరుతూ విజయవాడలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కన్వీనర్ బాబురావు, కార్యకర్తలు.. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. 90 శాతం పూర్తైన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క విజయవాడ నగరంలోనే 15 వేలకు పైగా గృహాలు నిర్మించి…
ఏపీ సీఎం జగన్ నేడు జగనన్న తోడు పథకం లబ్దిదారులకు నేరుగా వారి అకౌంట్లలో నగదు జమచేశారు. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాల ఇచ్చి వారికి అండగా నిలిచారు. అయితే ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. నవ రత్నాల లబ్ధిదారులు కూడా రాక్షస మనస్తత్వంతో చంద్రబాబు వెంట వెళుతున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమాపై చంద్రబాబు అనవసర రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. అంతేకాకుండా అఖండ, పుష్ప, బంగార్రాజు లాంటి సినిమాలు…
ఏపీలో జగనన్న తోడు పథకం కింద వడ్డీలేని రుణాలను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల ఖాతాల్లో రుణాలను సీఎం జగన్ జమచేమచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న తోడు మూడో విడత కింద 5,10,462 మందికి మంచి చేస్తూ రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని ఆయన అన్నారు. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, వీరితో కలుపుకుంటే 14.16 లక్షల మందికి మేలు చేయగలిగామని ఆయన వెల్లడించారు. నామమాత్రపు…
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికపై అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. ఈక్రమంలోనే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలికపై గత కొన్ని రోజుల నుంచి సాజిద్ అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా సమాచారం.. ఆమెను బెదిరించి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అఘాయిత్యాలకు ఒడిగట్టేవాడని తెలిసింది.. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో…
అసాంఘీక కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా డార్క్ వెబ్ నెలవైంది. ఈ వెబ్సైట్లో దొరకనిది అనేది ఉండదు. మనిషిని చంపాలన్న మనిషిని వెంటాడి కిడ్నాప్ చేయాలని, డ్రగ్స్ కావాలన్నా, ఆయుధాలు కావాలని డార్క్ వెబ్‌లో విచ్చలవిడిగా దొరుకుతాయి. డార్క్ వెబ్ పైన ఎవరు నిఘా పెట్టలేదు. అయితే హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన డార్క్ వెబ్ పైన నిఘా పెట్టారు. సిటీ పోలీస్ నుంచి ఎప్పటికప్పుడు డార్క్ వెబ్ పై అనాలసిస్ చేస్తున్నారు. అంతేకాదు…
పోలియో చుక్కల పంపిణీ ఆదివారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో మొదటి రోజు ఐదుసంవత్సరాల్లోపు చిన్నారులందరికీ ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు, అంగన్‌వాడీ సెంటర్లు, పంచాయతీ కార్యాలయాలతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తల్లిదండ్రులు చుక్కలు వేయించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రత్యేక సెంటర్లను నెలకొల్పారు. పోలియో సమూల నిర్మూలనకు చేపట్టిన పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఇందిరాపార్క్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి…
ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. బాంబుల వర్షం కురిపిస్తూ ఉక్రెయిన్‌ను గడగడలాడిస్తోంది. అంతేధీటుగా ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా సైనిక దళాలపై దాడి చేస్తోంది. అంతేకాకుండా ఇటీవల ఉక్రెయిన్‌కు వివిధ దేశాలు మద్దతుగా నిలిచి, ఆయుధాలను అందిస్తున్నాయి. అయితే తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన ‘ఏఎన్-225 మ్రియా’ను రష్యా దళాలు ధ్వంసం చేశాయి. ప్రపంచపు అతిపెద్ద కార్గో విమానంగా , అత్యంత పొడవైన బరువైన విమానంగా కూడా ‘ఏఎన్-225 మ్రియా’ రికార్డ్ నెలకొల్పింది. ఆంటోనోవ్ ఎఎన్-225 మ్రియా…
సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదలడం లేదు. అమాయకులైన ప్రజలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. మరోవైపు మరి కొందరు.. రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి వివాదస్పద పోస్టులు పెడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. అయితే తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా నిన్న హ్యాక్‌కు గురైంది. ఆయన ఖాతాను తమ అధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు క్రిప్టో కరెన్సీ ద్వారా…
టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. మాజీమంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకులు యడ్లపాటి వెంకట్రావు (102) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. 1967లో గుంటూరు జిల్లా వేమూరి నుంచి యడ్లపాటి వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్‌లో చేరిన యడ్లపాటి.. వేమూరి నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978-80 మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. 1983లో టీడీపీలో చేరిన యడ్లపాటి వెంకట్రావు.. 1995లో గుంటూరు జడ్పీచైర్మన్‌గా…