Vemula Prashanth Reddy : అబ్బురపడేలా నూతన సెక్రటేరియట్ నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సెక్రటేరియట్ ప్రపంచమే అబ్బుర పడే విధంగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సచివాలయ పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మెయిన్ గ్రాండ్ ఎంట్రీ,బేస్మెంట్ ఎలివేషన్, కోర్ట్ యార్డ్,జిఆర్సీ కాలమ్స్ క్లాడింగ్,కాంపొండ్ వాల్ అర్నమెంట్ గ్రిల్,ఫాల్ సీలింగ్,గ్రౌండ్ ఫ్లోర్ కారిడార్,గ్రానైట్స్ ఫ్లోరింగ్ డిజైన్,ఫైర్ సేఫ్టీ వర్క్స్, ఎంట్రన్స్ లాబీ,ఆఫీసర్స్ ఛాంబర్స్,మంత్రుల ఛాంబర్స్ పనులు పరిశీలించారు.ఫ్లోర్ వైస్ పనుల పురోగతి పరిశీలించారు. బేస్మెంట్ ఎలివేషన్ కోసం వినియోగించే దూల్ పూర్ స్టోన్ మొత్తం 3వేల క్యూబిక్ మీటర్ల మేర పట్టనుండగా..రోజు 50 వేల క్యూబిక్ మీటర్ల చొప్పున పూర్తయ్యేలా రోజుకు ఐదు లారీల లోడ్ స్టోన్ 60 రోజుల్లో తెప్పించి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను, వర్క్ ఏజెన్సీ ని ఆదేశించారు.
రాయి డిజైన్ పనుల కోసం మూడు షిఫ్టుల్లో నాలుగు టీములుగా ఏర్పడి పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. మెయిన్ ఎంట్రీ అర్నమెంట్ రెయిలింగ్ గ్రిల్ పరిశీలించి పలు సూచనలు చేశారు. UPVC విండోస్ శాంపిల్స్ పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం పలు సూచనలు చేశారు. మెయిన్ గ్రాండ్ ఎంట్రన్స్ మెట్ల మార్గంలో వాడే రెయిలింగ్ డిజైన్ పరిశీలించి తగు సూచనలు చేసారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై అంతస్తు వరకు నిర్మాణ పనులు సమాంతరంగా జరగాలని,ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.
Also Read
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!