ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మంగళవారం గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరులో గల గార్డెన్స్‌లోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలు వజ్రోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయకుడు మాట్లాడుతూ.. పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల ఎందరో సమర్థులను దేశానికి అందించిందని ఆయన అన్నారు. ఎంతో ముందుచూపుతో అప్పట్లో సీతారామయ్య ఈ పాఠశాలను ఏర్పాటు చేశారని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దని విద్య నిరుపయోగమని మహాత్మా గాంధీ అన్నారని, సమాజంలో రోజురోజుకూ విలువలు తగ్గుతున్నాయని అన్నారు. ప్రజల మధ్య…
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించిన డేటా ప్రకారం.. భారతదేశంలో ఒకే రోజు 6,915 కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు పెరిగాయి. దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 4,29,31,045కి చేరుకుంది. అయితే యాక్టివ్ కేసులు 60 రోజుల తర్వాత లక్ష కంటే తక్కువకు పడిపోయాయి. 24 గంటల్లో 180 కొత్త మరణాలు నమోదవడంతో మరణాల సంఖ్య 5,14,023కి చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసులు 92,472కి తగ్గాయి. ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.22 శాతం ఉన్నాయి. అయితే దేశంలో రికవరీ…
దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అత్యధిక వృద్ధి రేటును (9.2%) నమోదు చేసింది, ఇది 1,896 kwh (2018-19) నుండి 2,071 kwh (2019-20)కి పెరిగిందని తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ తెలిపింది. పెరుగుతున్న విద్యుత్ వినియోగం అధిక అభివృద్ధి మరియు మానవ సంక్షేమ సూచికలతో పరస్పర సంబంధం కలిగి ఉంది. రాష్ట్రంలో 1.65 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 72.8 శాతం గృహ కనెక్షన్లు, 15.4 శాతం వ్యవసాయ, 11.6 శాతం పారిశ్రామిక…
హైదరాబాద్ నగరంలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. లోధా అపార్ట్మెంట్స్ లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 13 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో 13 మంది పేకాట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పోలీసులకు పట్టుబడిన వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు.…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రెండో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో మొత్తంగా 250 మంది విద్యార్థులున్నారు. శనివారం 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్ఇండియా విమానం ముంబైకి చేరుకుంది. ఇలా విమానాశ్రయానికి చేరుకుంటున్న విద్యార్థులకు వారి ఊర్లకు వెళ్లేందుకు టీఎస్ఆర్‌టీసీ మరో ముందడుగు వేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థుల…
వ్యాపారం చేసినవారితో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఇలా ప్రతి ఒక్కరికీ బ్యాంకుతో సంబంధం ఉంటుంది. ఏమైనా లావాదేవీలకు వ్యాపరస్తులు ఖచ్చితంగా బ్యాంకులు అశ్రయించాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సార్లు నెలల అధిక సెలవులు రావడంతో బ్యాంకులు రోజుల కొద్ది మూతపడుతుంటాయి. ఈ నేపథ్యంలో మార్చి నెలలో దేశవ్యాప్తంగా భారతీయ రిజర్వు బ్యాంకు 13 రోజులు సెలవులను ప్రకటించింది. కానీ ఏపీ, తెలంగాణతో మాత్రం 8 మాత్రమే మూసుకోనున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం…
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అభిషేక ప్రియుడైన భోలాశంకరుడికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. సముద్ర స్నానాలు, నదీ స్నానాలను ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. కాళేశ్వరం ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సందడి నెలకొంది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు, ఆలయంలో స్వామి వారికి భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటలకు…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు కొత్త స్క్రిప్ట్ తయారుచేసుకుని సినిమా చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారాముల దర్శించుకున్న ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై ధ్వజం ఎత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని ఆయన విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి, అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఉద్యోగ నోటిఫికేషన్లు, రెండు పడక గదుల ఇల్లు, దళిత…
సాక్షి పత్రికలో తనను కించపరుస్తూ కథనాలను ప్రచురించినందున 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు విశాఖకు నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. అదానీ డేటా సెంటర్ ముంబై పోయింది… ఒక్క పరిశ్రమ రాలేదు… ఏపీ పెట్టుబడులు ప్రక్క రాష్ట్రాలు లో పెడుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ వారు అంతా గాడిదలు కాస్తున్నారని, వైసీపీ వాళ్ళు ఇక్కడ డబ్బులు దోచుకోని ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారని…
క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జగనన్న తోడు పథకం కింద వడ్డీలేని రుణాలను జమచేశారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజుకు రూ.10ల వడ్డీకూడా చెల్లించాల్సిన పరిస్థితులు చిరువ్యాపారులకు ఉండేవని, ఇవాళ రూ.510.46 కోట్ల రుణాలు ఇవ్వడమే కాకుండా, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తున్నామన్నారు. మొత్తంగా ఇవాళ రూ.526.62 కోట్లను ఇస్తున్నామని, గొప్ప వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తీసుకున్న…