Indra Karan Reddy : తనను టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికపై అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. ఈక్రమంలోనే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలికపై గత కొన్ని రోజుల నుంచి సాజిద్ అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా సమాచారం.. ఆమెను బెదిరించి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అఘాయిత్యాలకు ఒడిగట్టేవాడని తెలిసింది.. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.
అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నైతిక బాధ్యత వహిస్తూ సాజిద్‌ఖాన్‌ను టీఆర్‌ఎస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
-
Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?