రాజశేఖర్ రెడ్డి కుటుంబం కంటే టీడీపీ హయాంలో ఎక్కువ అభివృద్జి జరిగిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుంటానని వైస్సార్సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమరనాథ్ అన్నారు. చంద్రబాబు చూసి ఉత్తరాంధ్ర ప్రజలు అస్యహించుకుంటున్నారని ఆయన విమర్శించారు. అమరావతి ప్రజల రాజధాని కాదు పెట్టుబడిదారుల రాజధాని అని, ఉత్తరాంధ్ర రాయలసీమ మీద చంద్రబాబు విషం చిమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపార అని, ఉత్తరాంధ్రకు వచ్చి చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు…
ఉక్రెయిన్‌లో ఇరవై వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది వైద్య విద్యార్ధులు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో వారిని కేంద్ర ప్రభుత్వం క్షేమంగా స్వదేశం రప్పించింది. ఐతే, కర్ణాటకకు చెందిన మెడికల్ స్టూడెండ్ నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడ తాజా ఘర్షణలకు బలయ్యాడు. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో నవీన్ చదువుతున్నాడు. ఈ ఘటన తరువాత ఉక్రెయిన్ వైద్య విద్య అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్‌లో మెడిసిన్ సీటు రాని వారు విదేశీ యూనివర్సిటీల…
టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల సర్పంచులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు, గుమ్మడి సంధ్యారాణి లు హజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ హయాంలో సర్పంచులకు స్వర్ణయుగంగా ఉండేదని, సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చింది టీడీపీనేనని ఆయన అన్నారు. ఇప్పుడు గ్రామంలో మరుగుదొడ్లకు జగన్ రంగులు వేసుకుంటున్నారని, 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 7600 కోట్లు దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. గ్రామ…
ఏపీలో 3 రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తన తీర్పులో స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజధాని అంశంలో చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి లేదని వెల్లడించింది. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష…
ఏపీలో రాజధాని రగడకు తెరపడినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు కావడంతో విచారించిన హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. పెద్దవాడిగా సీఎం జగన్‌కు చెబుతున్నా, జరిగింది జరిగిపోయింది.. ఇకనైనా అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటిస్తే…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభానికి సిద్ధమైయ్యాయి. ఈ నెల 3వ తేదీన ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 5.18 ఎకరాల విస్తీర్ణంలో 36.27 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. రూ. 3.51 కోట్ల వ్యయంతో రోడ్లు, విద్యుత్, డ్రైనేజి, సౌకర్యాలు కల్పించామని తెలిపారు.…
మహారాష్ట్రలోని ఆన్‌లైన్ పబ్జీ గేమ్ ఆడిన తర్వాత జరిగిన వివాదంలో తమ స్నేహితుడిని చంపినందుకు పోలీసులు మంగళవారం 20 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి ఇద్దరు మైనర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేలోని వర్తక్ నగర్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు స్నేహితులు తరచూ పబ్జీ గేమ్ ఆడుతూ, ఆ తర్వాత ఏదో ఒక సమస్యపై గొడవ పడుతుండేవారని వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సదాశివ నికమ్ తెలిపారు. సోమవారం…
రోజురోజుకు మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల దాడులు పెరిగిపోతున్నాయి. గత కొంతకాలంగా మావోయిస్టుల తమ ఉనికి కాపాడుకోవడానికి నిత్యం దాడులు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్‌లో నిన్న రాత్రి నక్సల్స్ దుశ్చర్యకు పాల్పడ్డారు. అర్ధరాత్రి పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోత్కపల్లి క్యాంపుపై ఒక్కసారిగా మావోలు దాడి దిగారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. జవాన్ల కాల్పులలో పలువురు మావోయిస్టులు…
అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం వెలిగిపోతోందని, విజయపథంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, దీనికి కేంద్రం విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని వెల్లడించారు. తలసరి ఆదాయం 2014 నుంచి 2021 వరకు 125 శాతం పెరిగినట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. జీఎస్డీపీ 130 శాతం పెరిగినట్లు తెలిపారు. దేశంలోనే అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి అని కేటీఆర్ హర్షం…
ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయల కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని ఆయన…