సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభానికి సిద్ధమైయ్యాయి. ఈ నెల 3వ తేదీన ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 5.18 ఎకరాల విస్తీర్ణంలో 36.27 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. రూ. 3.51 కోట్ల వ్యయంతో రోడ్లు, విద్యుత్, డ్రైనేజి, సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
మంచినీటి సౌకర్యం కోసం 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 4 సంపులను నిర్మించినట్లు వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు. ప్రతి కుంటుంబానికి సొంతిళ్లు ఉండాలన్నది సీఎం కేసీఆర్ కల అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు.