ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. ఎన్నో రోజుల ఎదురుచూపులు రేపు సమాధానం దొరకబోతోంది. క్రేజీ కాంబో కోసం ఎదురుచూసిన అభిమానుల ఆకలి రేపటితో తీరబోతుంది. ఎన్టీఆర్ 30 అప్డేట్ తో రేపు తారక్ అభిమానులకు పండగ మొదలైపోయింది. మే 20 ఎన్టీఆర్ అభిమానులకు పండగ.. ఎందుకంటే ఆరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. తారక్ అభిమానులు ఊరువాడా ఏకం చేసి కేకులు కట్ చేసి పండగ జరుపుకోనేరోజు. ఇక ఈరోజు కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తారు. ఇక…
ఆంధ్రప్రదేశ్‌లో మరో సంక్షేమ కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పశుపోషకుల ఇంటిముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. సుమారు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. అయితే.. తొలిదశలో రూ.143 కోట్లతో సిద్ధం చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్ వైఎస్సార్ సంచార పశు…
యావత్త ప్రపంచానని భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. అయితే థర్డ్ వేవ్‌ను సమర్థవంగా ఎదుర్కున్న భారత ప్రభుత్వం.. ఇప్పుడు.. ఫోర్త్ వేవ్ వచ్చిన భయం లేదంటోంది. అయితే గత 24 గంటల్లో 4.77 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 2,364 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,582 మంది కరోనా నుంచి కోలుకోగా… 10 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,419 యాక్టివ్ కేసులు ఉన్నాయి.…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారువారి పాట. ఇటీవలే రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. వింటేజ్ మహేష్ లుక్ పోకిరి, దూకుడును గుర్తుచేస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఇక ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు తమదైన రీతిలో ప్రశంసలు అందించారు. తాజగా ఈ సినిమాపై సూపర్ స్టార్ కృష్ణ ప్రశంసల జల్లును కురిపించారు.…
సౌత్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ మొత్తం స్నేహితులే.. వారు, వీరు అని లేకుండా అందరితో సామ్ ఎంతో సన్నిహితంగా ఉంటోంది. ఇక సామ్ స్నేహితులు ఎంతమంది ఉన్నా ఆమె బెస్ట్ ఎవరు అంటే తక్కువ శిల్పారెడ్డి పేరు చెప్పేస్తారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన శిల్పా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కష్టనష్టాల్లో ఉన్నవారికి ఒక ఫ్రెండ్ ఇచ్చే ఓదార్పు మాటలో చెప్పలేనిది. తన కుటుంబంలో ఒకరిగా చూసుకొనే స్నేహితులు చాలా అరుదు. అలాంటివారిలో సామ్ కి దొరికిన…
నందమూరి బాలకృష్ణ ఇంటివద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో బాలయ్య ఇంటి గేటు ధ్వంసమయ్యింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద ఉన్న బాలకృష్ణ ఇంటివైపుకు ఒక వాహనం దూసుకువచ్చింది. బ్రేకులు సరిగా పడని కారణంగా ఆ వాహనం అదుపుతప్పి బాలయ్య ఇంటి గేటును ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో బాలకృష్ణ ఇంటి గేటు పూర్తిగా ధ్వంసమయ్యింది. వాహనాన్ని ఒక యువతి నడపడం విశేషం.. అంబులెన్స్ కి దారి ఇచ్చే…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి అభిమానులకు చేదువార్త తెలిపింది. నిత్యం సోషల్ మీడియాలో యోగా వీడియోలతో ప్రత్యక్షమయ్యే ఆమె సడెన్ గా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పింది. దీంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు. “తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు ఇన్ స్టా ఖాతాకి బ్రేక్ ఇస్తున్నాను. కొన్నిరోజులనుంచి ఒకే రకమైన యాక్టివిటీ నాకు బోర్ కొడుతుంది. అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి. కొత్త అవతార్ ని కనుగొనేంత వరకూ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నాను” అని…
టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ కమెడియన్ గా పలు పాత్రల్లో నటించి మెప్పించిన ఆమె వివాదాలలో ఇరుక్కోవడం కొత్తేమి కాదు. చాలా సార్లు, చాలా ఇంటర్వ్యూలో పలువురిని నోటికి వచ్చినట్లు మాట్లాడి వివాదాల్లో ఇరుక్కుంది. ఇక తాజాగా మరో వివాదంలో కరాటే కళ్యాణి ఇరుక్కోవడం ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. గత రాత్రి కరాటే కళ్యాణి, ప్రముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసినట్లు ఉదయం…
జ్యోతిష్యాన్ని నమ్మడం, నమ్మకపోవడం వారి వారి నమ్మకాలను బట్టి ఉంటుంది. అయితే కొంతమంది జ్యోతిష్యులు చెప్పినవి చెప్పినట్లు జరిగితే కొన్నిసార్లు నమ్మకతప్పదు అనిపిస్తుంది. అలాంటి జ్యోతిష్యుల్లో ఒకరు వేణుస్వామి.. ఈయన గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత మరియు నాగ చైతన్యలకు పెళ్లి జరిగితే ఎక్కువ కాలం కలిసి ఉండే అవకాశం లేదు అని చెప్పి సంచలనం సృష్టించాడు. ఆయన మాటలు అప్పుడు లెక్కచేయకపోయినా నిజం సామ్- చై విడాకులు తీసుకునే సరికి వవేణుస్వామి…
ఆరు నియోజకవర్గాలు కలిగిన విశాఖపట్టణంజిల్లా ప్రధాన రాజకీయపార్టీలకు ఆయువు పట్టు. సంస్ధాగతంగా పార్టీల బలోపేతంపై టీడీపీ, వైసీపీ ఫోకస్ పెంచాయి. సోషల్ ఇంజనీరింగ్‌లో పది అడుగులు ముందేవున్న వైసీపీ.. కీలకమైన జిల్లా అధ్యక్ష పదవిలో మార్పు చేసింది. మూడేళ్లు మంత్రిగా ఉన్న భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. తొలిసారి పార్టీని నడిపించే అవకాశం లభించడంతో అవంతి సైతం ప్రతిష్టాత్మకంగానే భావిస్తున్నారు. కానీ, క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్ధితులు అవంతికి ఏ మాత్రం కొరుకుడుపడ్డం లేదనేది…