టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ కమెడియన్ గా పలు పాత్రల్లో నటించి మెప్పించిన ఆమె వివాదాలలో ఇరుక్కోవడం కొత్తేమి కాదు. చాలా సార్లు, చాలా ఇంటర్వ్యూలో పలువురిని నోటికి వచ్చినట్లు మాట్లాడి వివాదాల్లో ఇరుక్కుంది. ఇక తాజాగా మరో వివాదంలో కరాటే కళ్యాణి ఇరుక్కోవడం ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. గత రాత్రి కరాటే కళ్యాణి, ప్రముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక తాజాగా శ్రీకాంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి కరాటే కళ్యాణి పై సంచలన ఆరోపణలు చేశాడు.
“గత రాత్రి కరాటే కళ్యాణి, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి మా ఇంటికి వచ్చింది.. ఆడవారిని పెట్టుకొని అసభ్యకరంగా ప్రాంక్ లు చేస్తున్నావ్ అంటూ నన్ను నిలదీసింది.. ఇక నేను మీరు కూడా బాబీ అంటూ అసభ్యంగా కామెడీ చేయలేదా అని అడిగాను. అందుకు ఆమె నాపై నోరు పారేసుకుంది. ఆ తరువాత నేనేమి ఊరికే ఆడవారిని అనడం లేదని, వారికి డబ్బులు ఇచ్చి, వారి ఇష్టప్రకారమే నటించమని చెప్పానని చెప్పాను. అప్పుడు కరాటే కళ్యాణి నన్ను రూ. లక్ష ఇవ్వమని అడిగింది. ఎందుకు ఇవ్వాలంటే నాపై దాడి చేసింది. అంతలోనే ఆ పక్కన ఉన్న ఇద్దరు మేము సెటిల్ చేస్తామని రూ 70 వేలు ఇవ్వు చాలు అంటూ మాట్లాడారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని నేను అడిగేసరికి వారు ముగ్గురు కలిసి నాపై దాడి చేశారు. నా షర్ట్ చింపేసి ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. దయచేసి నన్ను వారినుంచి కాపాడండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. నేను ప్రాంక్ వీడియోలు కేవలం వినోదం కోసమే చేస్తున్నాను.. ఆడవారిని కించపర్చడానికి కాదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.