నందమూరి బాలకృష్ణ ఇంటివద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో బాలయ్య ఇంటి గేటు ధ్వంసమయ్యింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద ఉన్న బాలకృష్ణ ఇంటివైపుకు ఒక వాహనం దూసుకువచ్చింది. బ్రేకులు సరిగా పడని కారణంగా ఆ వాహనం అదుపుతప్పి బాలయ్య ఇంటి గేటును ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో బాలకృష్ణ ఇంటి గేటు పూర్తిగా ధ్వంసమయ్యింది.
వాహనాన్ని ఒక యువతి నడపడం విశేషం.. అంబులెన్స్ కి దారి ఇచ్చే క్రమంలో వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్నదని , అది తీసే క్రమంలో వాహనం బాలయ్య ఇంటి వైపు దూసుకెళ్లిందని ఆమె తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరుగక పోయేసరికి అంటారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక బాలయ్య ఇంటివద్ద ప్రమాదం జరగడంతో జనం గుంపులు గుంపులుగా చూడ్డానికి ఎగబడ్డారు. ఇక ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని జనాలను అదుపుచేశారు.

Balakrishna