బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి అభిమానులకు చేదువార్త తెలిపింది. నిత్యం సోషల్ మీడియాలో యోగా వీడియోలతో ప్రత్యక్షమయ్యే ఆమె సడెన్ గా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పింది. దీంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు. “తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు ఇన్ స్టా ఖాతాకి బ్రేక్ ఇస్తున్నాను. కొన్నిరోజులనుంచి ఒకే రకమైన యాక్టివిటీ నాకు బోర్ కొడుతుంది. అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి. కొత్త అవతార్ ని కనుగొనేంత వరకూ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో శిల్పాశెట్టి ఒకరు.
ఇక కొన్ని నెలల క్రితం భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యాకాశిల్పా లైఫ్ మారిపోయింది. చాలా రోజులు మీడియా ముందుకు కూడా రాలేదు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. ఇక ఆ తరువాత కొన్ని రోజులకు గొడవ సద్దుమణిగాక అమ్మడు మళ్లీ షూట్స్ తో బిజీగా మారింది. ఇక ఇటీవలే తన టాక్ షో లో శృంగార మాటలు మితిమీరి మాట్లాడుతున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. ఇక ఈ నేపథ్యంలో అమ్మడు ఇన్స్టాగ్రామ్ కు ఫుల్ స్టాప్ పెట్టడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. మరి అస్సలు నిజంగా సోషల్ మీడియా బోర్ కొట్టి అమ్మడు గుడ్ బై చెప్పిందా..? మరేదైనా కారణం ఉందా..? అనేది తెలియాల్సి ఉంది.