అనుష్క షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు గుడ్ బై..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకొంది. ఇక పెళ్లి తరువాత కూడా ఆమె నటించవచ్చని, అందులో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని విరాట్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. దీంతో పెళ్లి తరువాత అడపాదడపా యాడ్స్ కనిపించిన అనుష్క పాప పుట్టాకా మొత్తం తగ్గించేసింది. అంతకుముందు నిర్మాణ రంగంలో ఉండి సినిమాలను నిర్మించే అనుష్క ఇక ఆ బాధ్యత నుంచి కూడా వైదొలగినట్లు పేర్కొని షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ నిర్ణయంతో ఈ భామ అభిమానులకు షాక్ ఇచ్చింది. కుటుంబ బాధ్యతలకు పూర్తిగా అకింతమవ్వడానికి సినిమాలకు కూడా గుడ్ బై చెప్తున్నట్లు ఆమె పేర్కొన్నదని వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబంకు ఎక్కువ సమయం కేటాయించే ఉద్దేశ్యంతో నిర్మాణ సంస్థ నుండి వైదొలిగా.. అంతే కాకుండా హీరోయిన్ గా కూడా ఇంతకు ముందు చేసినట్లుగా సినిమాలు బిజీ బిజీగా చేయడం లేదు. నా పరిమితి లో తక్కువ సమయం కేటాయిస్తూ సినిమాల్లో నటిస్తాను తప్ప గతంలో మాదిరిగా ఎక్కువ సినిమాలు చేయాలనే ఆసక్తి లేదు అన్నట్లుగా అనుష్క తెలిపిందని సన్నహితులు చెప్తున్నారు.
ఇక ఆమె నిర్ణయాన్ని విరాట్ కూడా అంగీకరించాడట. అనుష్క సినిమాలు చేసినా నాకు ఇష్టమే.. ఇలా ఉన్నా కూడా ఇష్టమే.. ఎందుకంటె ఆమె నిర్ణయం వెనుక ఎన్నో ఆలోచించి ఉంటుందని అనుకుంటున్నాను అని సర్దిచెప్తున్నాడట. ఇకపోతే అనుష్క నిర్ణయంపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. స్టార్ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని కుటుంబ బాధ్యతలు మోస్తూ కెరీర్ సెట్ చేసుకోవడం లేదా..? మరి నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్ అని కొందరు.. సరైన ప్లానింగ్ ఉంటే రెండు చోట్ల కూడా ఇబ్బంది లేకుండా అందరిని సంతృప్తి పరచవచ్చు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ విషయమై అనుష్క మరోసారి ఆలోచిస్తుందేమో చూడాలి.
Also Read
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!