విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటివరకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి.
రెండేళ్లలో ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పనులను పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ రక్కసిని కట్టడి చేయడంతోపాటు.. జిల్లాలో కరువుతో వ్యవసాయానికి దూరమైన 4 లక్షల ఎకరాలకు సాగునీరు.. హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పనులను రాబోయే రెండెళ్లలో పూర్తిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు అమెరికాలోని ఒహయోలోని రాబిన్స్ టన్నెల్…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ అయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు. గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తోన్న నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో సమావేశం అయింది.
నెల్లూరు జిల్లాలోని నారాయణ వైద్య కళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనం పైనుంచి దూకి ప్రదీప్ సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది.
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో వనజ, ఆశా, సీత, విజయ్ అనే నాలుగు ఏనుగులకు సోమవారం ఘనంగా జంబో విందు ఏర్పాటు చేశారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా, జూ అధికారులు ఈ నాలుగు ఆసియా ఏనుగులకు విందును అందించారు. పచ్చి సలాడ్, బెల్లం, చెరకుతో కలిపిన పండ్లు , కొబ్బరికాయలతో ప్రత్యేకంగా స్ప్రెడ్ చేయబడింది. భూషణ్ మంజుల నేతృత్వంలోని జూలోని ఫీడ్ స్టోర్ బృందం జంబో విందు ఏర్పాట్లతో ముందుకు వచ్చింది , ఏనుగుల సంరక్షకులు/మహౌట్‌లు,…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తన అసోసియేషన్ చరిత్రలో తొలిసారిగా మహిళా క్రికెటర్ల కోసం ప్రారంభ మహిళల T10 లీగ్‌ను ప్రారంభించినట్లు దాని అధ్యక్షుడు అర్షనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మహిళా లీగ్ ప్రారంభోత్సవంలో జగన్‌మోహన్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో 15 రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో దాదాపు 450 మంది మహిళా క్రికెటర్లు ఆడనున్నట్లు జగన్ తెలిపారు. ప్రతి జట్టు ప్రేరణ కోసం ఉప్పల్ అంతర్జాతీయ…
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె హైవే క్రాస్ సమీపంలో స్కూల్ వ్యాను బోల్తాపడిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పారిశుద్ధం పై ప్రత్యేక దృష్టి సాధించాలనీ, వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శ జిల్లా గా తీర్చిదిద్దాలని పంచాయితీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ, గృహనిర్మాణ శాఖ ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క (అనసూయ) అధికారులను ఆదేశించారు. స్వచ్ఛధనం పచ్చదనం ప్రత్యేక 5 రోజుల కార్యక్రమంలో చేపట్టిన పారిశుద్ధ్య పనుల ప్రగతి పై సమీక్షించుకుని ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ గా కొనసాగాలని ఆన్నారు.…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. సంబంధిత ₹3,01,116/- రూపాయల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సచివాలయంలో అందజేశారు.