అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌తో సంభాషణలు జరిపారు. ఈ సంభాషణలో ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రాట్లపై విరుచుకుపడ్డారు. అలాగే జో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుండి బలవంతంగా తొలగించారని చెప్పారు. బైడెన్‌కు వ్యతిరేకంగా డెమోక్రాట్ నేతలంతా తిరుగుబాటు చేసి ఆయనై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
కుటుంబాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవడం ఒక ఉత్తేజకరమైన ప్రయాణం, కానీ కొంతమందికి, ఇది సవాళ్లతో కూడా రావచ్చు. మీరు గర్భం ధరించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటుంటే, సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించడం మీ మాతృత్వ కలను సాధించడానికి కీలకమైన దశ. సంతానోత్పత్తి నిపుణుడి సహాయం పొందే సమయం కావచ్చు అనే కొన్ని ముఖ్య సూచికలు ఇక్కడ ఉన్నాయి.
ఫ్రీ హోల్డ్ స్కాంలో మరో బాగోతం వెలుగులోకి వచ్చింది. ఫ్రీ హోల్డులోకి కొన్ని ప్రభుత్వ భూములు వెళ్లినట్లు మంత్రి అనగాని సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వానికి చెందిన కొన్ని భూములను కూడా గత ప్రభుత్వం ప్రీ హోల్డ్ పెట్టేశారని రెవెన్యూ యంత్రాంగం గుర్తించినట్లు వెల్లడించారు.
తుంగభద్ర గేటు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. గల్లంతైన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీరు పూర్తిగా వృథాకాక ముందే స్టాప్‌లాగ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఏపీ అధికారులు.
మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఉదయమే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది ఏసీబీ అధికారులు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటివరకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి.
రెండేళ్లలో ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పనులను పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ రక్కసిని కట్టడి చేయడంతోపాటు.. జిల్లాలో కరువుతో వ్యవసాయానికి దూరమైన 4 లక్షల ఎకరాలకు సాగునీరు.. హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పనులను రాబోయే రెండెళ్లలో పూర్తిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు అమెరికాలోని ఒహయోలోని రాబిన్స్ టన్నెల్…