సనత్ నగర్ అసెంబ్లీ బన్సీలాల్ పేట, న్యూ బోయి గూడలో జరిగిన బోనాల పండుగ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా బన్సీ లాల్ పేట్ చాచా నెహ్రు నగర్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని సి-క్లాస్ బన్సీలాల్‌పేట – శ్రీ బండ మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. తర్వాత బన్సీలాల్ పేట శ్రీ రేణుకా ఎల్లమ్మ, శ్రీ నల్ల పోచమ్మ ముత్యాలమ్మ బోనాల…
జై గౌడ్ ఉద్యమం కమిటీ ఆధ్వర్యంలో 374వ సర్దార్ పాపన్న మహారాజ్ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేఫ్టీ మోపులు ఇవ్వబోతున్నామని, ప్రభుత్వ.. అసైన్డ్ భూముల్లో యాభై శాతం తాటి.. ఈత.. కర్జూరా మొక్కలను పెంచాలని సీఎం…
రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని వివేకానంద గౌడ్ విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంత షాడో మంత్రుల దందా నడుస్తుందని, కోవర్టు రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. సుంకిశాల ప్రమాదం పై బీఆర్‌ఎస్ పార్టీ పలు ప్రశ్నలను ప్రభుత్వం ముందు ఉంచిందని, సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన ఘటనలో ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. నిర్మాణం సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశామన్నారు వివేకానంద. ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత సోషల్…
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 229 మందికి 56 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని, రెండు పార్టీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణకి మోసం చేశాయన్నారు. బీజేపీకి 8 సీట్లు ఇస్తే తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని, బీజేపీకి ఆంధ్రా తీపి అయింది… తెలంగాణ చేదు అయ్యిందా..? అని…
సంగారెడ్డిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, BJYM జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లి కేటీఆర్ తో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడేమో..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మొదటినుంచి తోడు దొంగల పార్టీ..నాణానికి బొమ్మ బొరుసు ఈ పార్టీలు అని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, మెడిగడ్డ,…
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరరేందర్ పై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో నవజాత శిశువును రెండు రోజుల క్రితం కుక్కలు పీక్కుతిన్న ఘటనపై మాజీ ఎమ్మెల్యే నరేందర్ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ గేట్ ముందు నిరసన తెలిపారు. అయితే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అధిక సంఖ్యలో జనాలను గుంపులుగా తీసుకెళ్లి హాస్పటల్లోని సిబ్బంది, డాక్టర్ల విధులకు ఆటంకం కలిగించే విధంగా నిరసన చేపట్టారని మాజీ ఎమ్మెల్యే తో పాటు…
రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి జాతీయ వారోత్సవాలు జరిగాయి. సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మపాలన సంస్థ.. జైగౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కర్ణాటక కాంగ్రెస్ నేత ఎంఎల్సీ బీకే హరిప్రసాద్ గౌడ్ హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కార్యక్రమానికి గౌడ ప్రతినిధులు.. గౌడ కులస్తులు.. వివిధ రంగాలకు చెందిన గౌడ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ…
బలోద్‌లో ఇద్దరు మహిళలు, కొందరు సాయుధులతో సహా తొమ్మిది మంది మావోయిస్టుల యూనిఫారంలో మావోయిస్టు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆదివారం తెలిపారు. ఇది ఆగస్ట్ 4న గుర్తించబడింది. అదనంగా, మహామాయ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో నలుగురు వ్యక్తులు కనిపించారు, జూలై 2021లో మావోయిస్టు ప్రభావిత జాబితా నుండి జిల్లా తొలగించబడినప్పటికీ ఆందోళనలు రేకెత్తించాయి. దొండి బ్లాక్‌లోని మహామాయ , దుల్కీ గనులు చరిత్ర కలిగి ఉన్నాయి. నక్సలైట్ హింస, ఇప్పుడు పునఃపరిశీలన జరిగింది. ఈ ప్రాంతం…
విద్యుత్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాల సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, క్యూఆర్ కోడ్‌తో వినియోగదారులకు ఇంధన బిల్లులను జారీ చేస్తామని గత నెలలో ప్రకటించిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL) సదుపాయాన్ని నిలిపివేసింది. ఆగస్టు నుండి థర్డ్-పార్టీ యాప్‌ల ( UPIలు ) ద్వారా ప్రత్యక్ష చెల్లింపు నిలిపివేయబడిన తర్వాత యుటిలిటీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో యునిక్ సర్వీస్ కనెక్షన్ (USC) నంబర్‌ను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా అవాంతరాలు…