Vizag MLC Elections: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటివరకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను బొత్స సత్యనారాయణ పొందు పరిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పు 93లక్షలు, ఆస్తులు 73.14లక్షలు పెరిగినట్టు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ చూపించారు. టీడీపీ తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ పోటీ చేస్తుందో లేదో వేచి చూడాలి.
Read Also: CM Chandrababu: సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ
మరోవైపు.. గ్రేటర్ విశాఖ ఎన్నికల ఫలితాల తర్వాత అనుమానంతో ముందస్తుగా వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. దుష్టులకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సభ్యులను క్యాంపులకు పంపించామని బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది జడ్పీటీసీలు, 97 మంది కార్పొరేటర్లు, 53 మంది కౌన్సిలర్లు, మరో 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మరో ముగ్గురు వైసీపీ ఎక్స్ ఆఫీషియో కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉండగా, వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి. మరీ టీడీపీ పోటీలో నిలుస్తుందా లేదా అనేది కాసేపట్లో ఖరారు కానుంది.