భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయాన్ని డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క, ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనమనేని సాంబశివరావు పరిశీలించారు. జిల్లా అధికారులతో కలిసి బోటులో కిన్నెరసాని జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. టూరిజం హబ్‌గా కిన్నెరసాని, హోలాండ్ తరహలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పర్యాటక అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేవిధంగా ప్రణాళిక చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం…
వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామని.. సదరం ఫేక్ సర్టిఫికేట్ల జారీపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సోమవారం వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్కును కొరియన్ కంపెనీల పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిపారు. ఈ పర్యటనలో ఆయన వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు , అధికారుల బృందం ఉన్నారు. “#KOFOTI (కొరియా టెక్స్‌టైల్ ఇండస్ట్రీ) నిర్వహించిన బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో కొరియన్ టెక్స్‌టైల్స్ కంపెనీల నుండి మరిన్ని పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా #వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ఇటీవల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అనిరుధ్ తల్లి బాధను మీరు విన్నారు, అలాంటి బాధ ఎవరు పడవద్దని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హాస్టల్లో అనిరుధ్ చదువుతున్నాడు,ఎంతో మంది తల్లిదండ్రుల బాధపడే అంశమని, కుటుంబ సభ్యులు ఒకరిని కోల్పోతే ఎలా ఉంటుందని అందరికి తెలుసు…
రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న రేవంత్ పై సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేసారని, పెట్టబడులకు తెలంగాణను స్వర్గంగా మార్చుతున్నారన్నారు. రేవంత్ అమెరికా పర్యటన విజయవంతం కావడం బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని, సూటు బూటు వేసుకొని దావొస్ వెళ్లిన కేటీఆర్ ఎన్ని కంపెనీలను తెలంగాణకి తెచ్చారన్నారు ఆది శ్రీనివాస్. కేటీఆర్ ఏంవోయూ కుదుర్చుకున్న…
భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ జీవితం స్ఫూర్తిదాయకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక శాస్త్రవేత్త దేశం గురించి తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచన చేస్తే ఎంతటి గొప్ప ఫలితాలు వస్తాయో విక్రమ్ సారాబాయ్ జీవితమే ఉదాహరణ అంటూ ఆయన మాట్లాడారు.
కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రలో బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. నెహ్రూ అమలు చేసిన బానిసత్వ మరకలను తుడిచివేయాలని, అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం అందిస్తే… రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ అనేక పాపాలను యాడ్ చేసిందని ఆయన మండిపడ్డారు. మైనారిటీ సంతూష్టీకరణ విధానాలే దేశ అనిశ్చితికి కారణమని ఆయన ధ్వజమెత్తారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందిస్తే… అందులో కాంగ్రెస్ అనేక పాపాలను జత చేసిందని…
దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతాలు, ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు…
‘అగ్నిపథ్’ మంచి పథకమని పేర్కొంటూ ప్రతిపక్షాలు విద్యార్థుల్లో గందరగోళం సృష్టించి విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ మైలేజీ పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. పథకంలో ఏదైనా సమస్య ఉంటే సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాల కుట్రలో ఇరుక్కుని విద్యార్థులు నిర్ణయాత్మకంగా ఉండవద్దని సూచించారు. ఆదివారం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ నుండి ప్రాతినిధ్యాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రి…