Student Suicide: నెల్లూరు జిల్లాలోని నారాయణ వైద్య కళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనం పైనుంచి దూకి ప్రదీప్ సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. నారాయణ వైద్య కళాశాలలో ఎం.బి.బి.ఎస్ రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ అనే విద్యార్థితో ప్రదీప్‌కు స్నేహం ఉంది. ఇటీవల మిత్రుల మధ్య విభేదాలు రావడంతో ప్రదీప్‌ను రాహుల్ పక్కన పెట్టాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు రాహుల్ కారణమని ప్రదీప్ మెసేజ్ పెట్టినట్లు తెలిసింది. ప్రదీప్ అనంతపురానికి చెందిన వాడిగా గుర్తించారు.
Read Also: Bihar: ఇదెక్కడి మాస్ రా మావా! మేనకోడలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అత్త..