కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ బోగస్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇవాళ ఆయన ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. 59 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, రైతులకు దగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు దగా, మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా…
కోల్ కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళన కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సంఘీభావం తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. CBI కేసును వేగవంతం చేయాలన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిండుతుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని దామోదర్ రాజనర్సింహ కోరారు. ఉస్మానియా ,…
రుణమాఫీ హామీపై మాట తప్పిన సిఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడు అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుచుకుంటున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని, అబద్దం కూడా సిగ్గుపడి మూసి దుంకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన అని ఆయన…
సీఎం రేవంత్ రెడ్డి పొద్దట్నుంచి అన్ని చోట్ల బూతులు మాట్లాడారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన భాష ను చూసి అందరూ సిగ్గుతో తల వంచుకుంటున్నారని, అధికారులు కూడా సీఎం అబద్దాలను చూసి సిగ్గుపడుతున్నారన్నారు. 30 వేల ఉద్యోగాల పై ,సీతారామ సాగర్ పై సీఎం వి మంత్రులవి అబద్దాలే అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రాష్ట్రం లో బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్…
తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చు అని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారని ఆమె మండిపడ్డారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం…
ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ లో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల ముందు ఛాలెంజ్ చేసి రుణ మాఫీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ రోజు చరిత్రలో లిఖించదగిన రోజు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశ చరిత్రలో తొలిసారి రూ.2లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఛాలెంజ్ చేసి ఆగస్టు 15నాటికి రుణమాఫీ చేస్తామని…
సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకితం చేశారు. రెండో పంప్ హౌస్ వద్ద పైలాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్.. అనంతరం స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ కు అడ్డా అని, ఖమ్మం గడ్డ మీద నుంచే రెండు లక్షల రుణ మాఫి గురించి హామి ఇచ్చామన్నారు. సోనియాగాంధీ మాట ఇచ్చింది అంటే హామీ నెరవేర్చలసిందేనని, పట్టువదలకుండ భట్టి…
పెద్దగోల్కొండ ORRపై ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్ఆర్ పై తుఫాన్ వాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో.. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తుక్కు గూడ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పతకాలను ప్రదానం చేసిన ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీకి చెందిన 18 మంది అధికారుల్లో ఇంటర్పోల్తో సంబంధం ఉన్న ఇద్దరు సీబీఐ అధికారులు కూడా ఉన్నారు. ఆరుగురు అధికారులకు విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి పోలీసు పతకాలు, 12 మందికి మెరిటోరియస్ సర్వీస్ కోసం పోలీసు పతకాలు లభించాయని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ప్రదీప్ కుమార్ కె,…