తమకు పుట్టిన పిల్లల కన్నా వాళ్లకు పుట్టిన పిల్లలనే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు నాయనమ్మలు, అమ్మమ్మలు. మనవళ్లు, మనవరాళ్లను అల్లారు ముద్దుగా, గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మనవడు అన్న కనికరం లేకుండా అమ్మకానికి పెట్టేసింది. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెంలో చోటుచేసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో మొత్తం రూ.31532 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తెలిసింది. మొత్తం 19 కంపెనీలతో సంప్రదింపులు.. ఒప్పందాలు జరిగింది. పలు కీలక ఒప్పందాలతో అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది.
హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని ఇబ్బందులతో ఇంటి నుంచి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తిని ఫిర్యాదు అందిన ఒక గంట వ్యవధిలోనే టెక్నాలజీ సహకారంతో గుర్తించి.. నిండు ప్రాణాన్ని జగద్గిరిగుట్ట పోలీసులు కాపాడారు.
ఇవాళ ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్ క్యాంపస్‌కు శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్‌తో చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవల బంద్‌కు జూడాలు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ 14వ తేదీన ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు జూడాలు ప్రకటనలో వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. రాజు అనే బార్బర్‌ను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు కొందరు దుండగులు. హత్య జరిగిన వెంటనే స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీక కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. సీఎం సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో కార్తీక కు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోంది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు…