తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసి, ప్రెస్ మీట్ లో విచారం వ్యక్తం చేసినంత మాత్రాన తెలంగాణ మహిళా సమాజం ఆ వ్యాఖ్యలను మరిచిపోదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ఉద్దేశించి నిన్న పార్టీ మీటింగ్ లో తెలంగాణ మహిళలను బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకొమ్మని…
శాఖ సమీక్షలు, జిల్లా పర్యటనలు, అధికార కార్యక్రమాలు, సమావేశాలు, సభలు, అభివృద్ధి పనుల పరిశీలన, ప్రజా సేవ, సందర్శకుల సమస్యల పరిష్కారం, పార్టీ ప్రోగ్రాముల్లో నిత్యం బిజీగా ఉండే మంత్రి సీతక్క నిత్య విద్యార్థిగా నిలుస్తున్నారు. సారం లేని భూమి చదువు లేని జీవితం ఒక్కటే అని బలంగా నమ్మే సీతక్క..అధ్యయనం పోరాటం అనే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. అధికార బాధ్యతలు నిర్వర్తిస్తూనే చదువుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రజా సేవలోనే ఉంటూ ఎల్ఎల్బి, రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసిన…
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లాకు చెందిన రాజేష్.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ మృతి చెందాడు. దీంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజేష్ బంధువులు అతడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు వెళ్లిన రాజేష్.. మూడు రోజుల…
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయ స్థానం పరిధిలోని అంశం. కవిత బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధం? అని ఆయన వ్యాఖ్యానించారు. ఆప్ పార్టీని విలీనం చేసుకుంటేనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ…
రుణమాఫీ అంతా బోగస్ అని తేలిపోయిందని, స్వతంత్ర భారతదేశంలో నే ఇది అతి పెద్ద మోసమన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకే సంతకంతో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అన్నారని, రైతులను రేవంత్ రెడ్డి అడ్డంగా మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు ప్రతి రైతు కు రుణమాఫీ చేస్తాము అన్నారని, రేషన్ కార్డు కావాలని చెప్పలేదన్నారు కేటీఆర్. వెంటనే వెళ్లి రెండు లక్షలు తెచ్చుకోండి అన్నారని, నలభై వేల కోట్లు…
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని, అలాగానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని గతంలో హరీష్ రావు వ్యాఖ్యలపై ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మైనంపల్లి అభిమానుల పేరిట వెలసిన ఫ్లెక్సీల్లో ఈ ఫ్లెక్సీల్లో దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణ మాఫీ అయి పోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్…
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ బోగస్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇవాళ ఆయన ఆదిలాబాద్లో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. 59 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, రైతులకు దగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు దగా, మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా…
కోల్ కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళన కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సంఘీభావం తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. CBI కేసును వేగవంతం చేయాలన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిండుతుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని దామోదర్ రాజనర్సింహ కోరారు. ఉస్మానియా ,…