ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తన సెటిల్ మెంట్ కోసమే.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నట్లు బండి సంజయ్ ఆరోపించారు. అటు మంత్రి కేటీఆర్ నలుగురు బీజేపీ కార్పొరేటర్ లు టచ్ లో ఉన్నారు అని అంటున్నాడు.. మాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు. తాము రాజకీయ వ్యభిచారులం కాదని... బీజేపీలో చేరాలి అంటే రాజీనామా చేయాలన్నారు.
కత్తిపూడి బహిరంగ సభలో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు రావని సీఎం జగన్ కథలు చెప్తున్నాడని.. నవంబర్, డిసెంబర్‌లలోనే ఎన్నికలు జరుగుతాయని పవన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వివిధ కేటగిరీల ఉద్యోగులకు 'స్పెషల్ పే' పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు G.O.Ms.79 ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఈ మధ్య చాలా ప్రముఖ కంపెనీలలో లేఆఫ్ కొనసాగుతుంది.. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు.. ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగులు ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. దాంతో చాలా మంది ఉద్యోగం పోతుందనే టెన్షన్ లో ఉన్నారు.. ఎప్పుడు తమ ఉద్యోగం పోతుందా అన్న భయం మొదలైంది. కేవలం జీతంపై బతికేవారికి ఒక్కసారిగా ఉద్యోగం పోతే కష్టాలు తప్పవు. సేవింగ్స్ ఉన్నవారికి ఇబ్బంది లేదు కానీ, ఎలాంటి సేవింగ్స్ లేనివాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి వారికి జాబ్ లాస్…